జైశ్వాల్ సంచలన నిర్ణయం, ముంబై రంజీ జట్టుకు గుడ్ బై
భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కీలక నిర్ణయం తీసకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో తన స్టేట్ టీమ్ నుంచి మారాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.

భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కీలక నిర్ణయం తీసకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో తన స్టేట్ టీమ్ నుంచి మారాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోరుతూ లేఖ రాశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
గోవా జట్టుకు మారాలనుకుంటున్నట్లు జైస్వాల్ చెప్పాడని, ఇది అతడి వ్యక్తిగత నిర్ణయమనీ ఎమ్‌సీఏ తెలిపింది. అలానే జైశ్వాల్ కు దగ్గరగా ఉన్న ఓ ప్రతినిధి కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కాగా, 2025-26 సీజన్ లో జైశ్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని సమాచారం.17ఏళ్ల వయసులో ముంబయి జట్టులోకి వచ్చిడా యశస్వి. 2018-19 సీజన్ లో ముంబయి జట్టు తరఫున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు.