Jasprit Bumrah: మూడో టెస్టుకు బూమ్రా దూరం.. కారణమిదే..?
తొలి రెండు టెస్ట్‌ల్లో అదరగొట్టిన బుమ్రా.. పేస్ బాధ్యతలను పూర్తిగా ఒక్కడే మోసాడు. తొలి టెస్ట్‌లో సిరాజ్.. రెండో టెస్ట్‌లో ముఖేష్ కుమార్ పూర్తిగా తేలిపోయారు. వైజాగ్ టెస్ట్‌లో బుమ్రా ఏకంగా 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే.. విశాఖలో గెలిచిన టీమిండియా, ఇంగ్లండ్‌ను దెబ్బకు దెబ్బ కొట్టి సిరీస్‌ను సమం చేసింది. రెండో టెస్ట్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు.
TSPSC Group 1: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 60 గ్రూప్-1 పోస్టులకు ఆమోదం
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడో టెస్ట్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్ట్‌ల్లో అదరగొట్టిన బుమ్రా.. పేస్ బాధ్యతలను పూర్తిగా ఒక్కడే మోసాడు. తొలి టెస్ట్‌లో సిరాజ్.. రెండో టెస్ట్‌లో ముఖేష్ కుమార్ పూర్తిగా తేలిపోయారు. వైజాగ్ టెస్ట్‌లో బుమ్రా ఏకంగా 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అసలే వెన్నుగాయంతో ఏడాది పాటు ఆటకు దూరమై.. రీఎంట్రీ ఇచ్చిన బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతని వర్క్‌లోడ్‌ను దగ్గరగా మానిటర్ చేస్తోంది. ఈ క్రమంలోనే మూడో టెస్ట్‌కు రెస్ట్ ఇచ్చి చివరి రెండు టెస్ట్‌లకు తాజాగా బరిలోకి దించాలని సెలెక్టర్లు భావిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు రెండో టెస్టుకు రెస్ట్ ఇచ్చారు. అతను రాజ్‌కోట్ టెస్ట్‌లో రీఎంట్రీ ఇవ్వనుండగా.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే చివరి మూడు టెస్టులకు కోహ్లీ రీఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతోంది. విరాట్ సెలెక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడా లేదా అనేదానిపై క్లారిటీ లేదు.