Jasprit Bumrah: బూమ్రా సతీమణిపై బాడీషేమింగ్ కామెంట్స్.. ధీటుగా బదులిచ్చిన సంజనా
కొందరు నెటిజన్లు.. సెలబ్రిటీల భార్యలను కూడా ట్రోల్ చేస్తూ బాడీ షేమింగ్ కామెంట్స్‌తో రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా భారత స్టార్ పేసర్ బూమ్రా సతీమణ సంజనా గణేశన్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది.

Jasprit Bumrah: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోలింగ్ చేయడం కామన్‌గా మారిపోయింది. ఇది ఒక పరిమితిలో ఉంటే పర్వాలేదు. అయితే కొన్నిసార్లు హద్దులు దాటుతుంటుంది. కొందరు నెటిజన్లు సెలబ్రిటీల భార్యలను కూడా ట్రోల్ చేస్తూ బాడీ షేమింగ్ కామెంట్స్‌తో రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా భారత స్టార్ పేసర్ బూమ్రా సతీమణ సంజనా గణేశన్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్‌కు ధీటుగా బదులిచ్చి సదరు నెటిజన్ల నోరూమూయించింది.
Suresh Raina, IVPL : రీ ఎంట్రీ ఇస్తున్న సురేష్ రైనా.. ఏ లీగ్ లో ఆడుతున్నాడంటే..
వాలంటైన్స్ డే సందర్భంగా బూమ్రాతో కలిసి చేసిన యాడ్ వీడియోను సంజన తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే, అందులో సంజన శరీరాకృతిపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. మీరు చాలా లావుగా ఉన్నారు అంటూ ఓ నెటిజన్ అనుచిత కామెంట్ చేశాడు. దీనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంజన ధీటుగా రిప్లై ఇచ్చింది. మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి మీకెంత ధైర్యం..? వెళ్లిపో ఇక్కడి నుంచి అంటూ బదులిచ్చారు.
ఆమె సమాధానంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబరులో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు.