Asia Cup: నోరు జారిన మియాందాద్ ఇండో -పాక్ క్రికెట్ వివాదానికి ఆజ్యం
ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం ముగిసి ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు పాకిస్త్ క్రికెట్ బోర్డు తో పాటు శ్రీలంక క్రికెట్ లు సన్నాహకాలు చేస్తున్న వేళ పాకిస్తాన్ దిగ్గజం జావేద్ మియందాద్ టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
భద్రతా కారణాలను చెప్పి పాకిస్తాన్‌కు రాకుండా ఉన్నందుకు టీమిండియా నరకానికి పోతుందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. పీసీబీ కూడా ప్రతీదానికి తలొగ్గుతూ దేశం పరువు తీస్తుందని వాపోయాడు. మియాందాద్ మాట్లాడుతూ.. ‘2012లో పాకిస్తాన్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇండియాకు వెళ్లింది. 2016 లో కూడా టీ20 ప్రపంచకప్ కూడా అక్కడే జరిగితే పాక్ అక్కడ ఆడింది. ఇప్పుడు పాకిస్తాన్‌కు రావడం భారత్ వంతు. నాకే గనక నిర్ణయాధికారం ఉంటే పాకిస్తాన్ భారత్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు అనుమతించను.
త్వరలో భారత్ వేదికగానే జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు కూడా పంపించను.. మేం ఇండియాతో ఆడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కానీ వాళ్లు మాత్రం మాలాగా సానుకూల స్పందన ఉండదు. పాకిస్తాన్ క్రికెట్ పెద్దది. మేం ఇప్పటికీ మెరుగైన ఆటగాళ్లను ప్రపంచ క్రికెట్‌కు అందిస్తున్నాం. మాతో ఆడటానికి వాళ్లు ఇక్కడికి రాకుంటే నరకానికి పోతారు. మనం వన్డే వరల్డ్ కప్‌లో ఆడకున్నా పెద్దగా నష్టమేమీ లేదు..’అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.