జియో హాట్ స్టార్ చరిత్ర వ్యూస్ లో ఆల్ టైమ్ రికార్డ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 03:45 PMLast Updated on: Feb 25, 2025 | 3:45 PM

Jio Hot Star History All Time Record In Views

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్‌మన్ గిల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో పలు రికార్డుల మోత మోగింది. భారీ అంచనాలతో జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరు బ్రాడ్ కాస్టర్లకు కాసుల పంట పండించింది. వ్యూయర్ షిప్ లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న జియో హాట్‌స్టార్ భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ లో అత్యధిక కంకరెంట్ వ్యూస్‌ను నమోదు చేసింది. విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో జియోహాట్ స్టార్ పంట పండింది. ఈ మ్యాచ్‌లో గరిష్టంగా 61 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. క్రికెట్ చరిత్రలోనే ఇది ఆల్‌టైల్ రికార్డ్. కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయలాంఛనం పూర్తి చేసుకోవడం బ్రాడ్‌కాస్టర్స్‌కు కలిసొచ్చింది. రత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకకాలంలో 61 కోట్ల మంది జియో హాట్ స్టార్ యాప్ వేదికగా వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. హాట్‌స్టార్ వ్యూస్ 10 కోట్లు ఉంది. పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఈ సంఖ్య 40 కోట్లకు చేరగా.. భారత్ బ్యాటింగ్ సందర్భంగా 55 కోట్లకు చేరింది. విరాట్ కోహ్లీ శతకం సమయంలో 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్. ఇదే టోర్నీలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గరిష్టంగా 35 కోట్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా భారత్-పాక్ మ్యాచ్ ఆ రికార్డ్‌ను తిరగరాసింది.

గతంలో హాట్ స్టార్, జియో సినిమా వేర్వేరుగా ఉండేవి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే రెండు కలిసిపోయి జియో హాట్ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వేర్వేరుగా ఉన్నప్పుడు గరిష్టంగా ఈ సంఖ్య 5 కోట్లు దాట లేదు. జియో సినిమా యాప్‌లో మొత్తం వ్యూస్‌ను డిస్‌ప్లే చేసేవారు. కానీ హాట్‌స్టార్‌లా కంకరెంట్ వ్యూస్ ఇచ్చే వారు కాదు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హాట్‌ స్టార్‌లో 4 కోట్లకు పైగా కంకరెంట్ వ్యూస్ వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఇదే అత్యధికం. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌గా రెండు కలిసిపోవడం.. ఉచితంగా మ్యాచ్‌లు ప్రసారం చేస్తుండటంతో ఈ సంఖ్య 12 రెట్లు పెరిగింది. అటు యాడ్ రెవెన్యూలోనూ ఈ మ్యాచ్ రికార్డుల మోత మోగించింది. పది సెకన్ల ప్రకటనకు 50 లక్షల చొప్పును ఛార్జ్ చేసినట్టు సమాచారం. నిజానికి భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా యాడ్ రెవెన్యూ ఓ రేంజ్ లో ఉంటుంది. గత దశాబ్దకాలంలోనే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లతో యాడ్ రెవెన్యూ 10 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా.