Jio Cinema: జియో సినిమాలో ఇండియా-ఆసీస్ సిరీస్ ఫ్రీ స్ట్రీమింగ్..!
ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట. ఇటీవల బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జియోసినిమా కూడా ఈ కంపెనీకి చెందినదే.
Jio Cinema: ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటిటి సంస్థ జియో సినిమా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట. ఇటీవల బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జియో సినిమా కూడా ఈ కంపెనీకి చెందినదే.
ఈ క్రమంలోనే కొత్త సైకిల్‌లో భాగంగా ఆసీస్‌తో సిరీస్ ఈ సంస్థకు తొలి కవరేజ్. దీన్ని అందరికీ ఉచితంగా ఇవ్వాలని జియోసినిమా భావిస్తోంది. అంతేకాదు మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచులను వీక్షించే అవకాశం కల్పిస్తుందట. సురేష్ రైనా, హనుమ విహారి, అమిత్ మిశ్రా వంటి మంచి ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా జియోసినిమా ప్రయత్నిస్తోంది. దేశంలో క్రీడలను చూసే అనుభవాన్ని పూర్తిగా మార్చేయడమే తమ లక్ష్యం అని వయాకామ్18 కంపెనీ సీఈవో అనిల్ జయరాజ్ స్పష్టం చేశారు.
ఇక ఆస్ట్రేలియాతో ఆడే మూడు వన్డేల సిరీస్ భారత్‌కు చాలా కీలకం కానుంది. ఇది ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో జట్టుకు చివరి మెరుగులు దిద్దేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆసీస్‌తో సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో ఇండియా వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి.