జియోహాట్ స్టార్ నయా హిస్టరీ వ్యూయర్ షిప్ రికార్డులన్నీ బ్రేక్

వరల్డ్ క్రికెట్ లో ఇండియా ఎక్కడ ఆడినా స్టేడియాలు హౌస్ ఫుల్ అవుతాయి… అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలో ఫైనల్ మ్యాచ్ అయితే ప్రత్యేకంగా చెప్పాలా… దేశం మొత్తం హాలిడేలానే ఉంటుంది.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయాన్ని చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ హంగామానే కనిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ వ్యూయర్ షిప్ లో సరికత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ను భారీ సంఖ్యలో అభిమానులు వీక్షించారు. మొదట న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు 39.7 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఆడే సమయంలో ఆ వ్యూవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోయాయి. రోహిత్ శర్మ, గిల్ భాగస్వామ్యం నెలకొల్పేటప్పుడు, కోహ్లీ ఔట్ అయ్యే సమయంలో వ్యూవర్‌షిప్ భారీగా ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా 90.1 కోట్ల వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్ లకు హాట్ స్టార్ పంట పండింది. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ భారీగా వ్యూయర్ షిప్ నమోదైంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు జియో హాట్‌స్టార్‌లో దాదాపు 66 కోట మంది వీక్షించారు. అంతకుముందు ఫిబ్రవరి 23న జరిగిన భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ను 60.2 కోట్ల మంది చూశారు. క్రికెట్ చరిత్రలోనే ఇది ఆల్‌టైల్ రికార్డ్. కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయలాంఛనం పూర్తి చేసుకోవడం బ్రాడ్‌కాస్టర్స్‌కు కలిసొచ్చింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకకాలంలో 61 కోట్ల మంది జియో హాట్ స్టార్ యాప్ వేదికగా వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. హాట్‌స్టార్ వ్యూస్ 10 కోట్లు ఉంది. పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఈ సంఖ్య 40 కోట్లకు చేరగా.. భారత్ బ్యాటింగ్ సందర్భంగా 55 కోట్లకు చేరింది. విరాట్ కోహ్లీ శతకం సమయంలో 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్. ఇదే టోర్నీలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గరిష్టంగా 35 కోట్ల వ్యూస్ వచ్చాయి. తర్వాత భారత్-పాక్ మ్యాచ్ ఆ రికార్డ్‌ను తిరగరాసింది.
ఇప్పుడా వ్యూవర్‌షిప్ రికార్డులను బ్రేక్ చేసిన ఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా భారత జట్టు ఫైనల్ చేరడం, ప్రత్యర్థి కివీస్ కూడా బలంగానే ఉండడం అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు కావడానికి కారణంగా చెప్పొచ్చు. మెగా టోర్నీలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడోసారి టైటిల్ నెగ్గి తీన్‌మార్ కొట్టింది. ఉత్కంఠ పోరులో అద్వితీయమైన ప్రదర్శనతో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. తర్వాత భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ 83 రన్స్ తో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. మొత్తం మీద టైటిల్ ఫేవరెట్ టీమిండియా ఆటతీరుతో జియో హాట్ స్టార్ వ్యూయర్ షిప్ రికార్డులను తిరగరాసింది.