Johnson Charles: సూర్యను కాపీ కొట్టాలని మూతిపళ్ళు రాలగొట్టుకున్నాడు..
తాజాగా సూర్యకుమార్ యాదవ్ స్టయిల్‌లో బ్యాటింగ్ చేయబోయి వెస్టిండీస్ ప్లేయర్ చార్లెస్ మూతి పగలగొట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో చార్లెస్, సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.

Johnson Charles: క్రికెట్‌లో విలక్షణమైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. తనకే సాధ్యమైన షాట్స్‌తో టి20 ఫార్మాట్‌లో కింగ్ అనిపించుకున్నాడు. గ్రౌండ్ నలువైపులా షాట్స్ ఆడుతూ మిస్టర్ 360 అనే పేరు తెచ్చుకున్నాడు.
పేస్ బౌలింగ్‌లో స్వీప్ షాట్స్ ఆడుతూ తన బ్యాటింగ్ స్టైలే వేరంటూ అందరికీ చాటి చెప్పాడు. ఇక తాజాగా సూర్యకుమార్ యాదవ్ స్టయిల్‌లో బ్యాటింగ్ చేయబోయి వెస్టిండీస్ ప్లేయర్ చార్లెస్ మూతి పగలగొట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో చార్లెస్, సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో ట్రిన్ బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌లా స్కూప్ షాట్ ఆడబోయాడు. బ్రావో వేసిన ఫుల్ టాస్‌ను వికెట్ల మీదుగా వెనక్కి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే సరిగ్గా కనెక్ట్ చేయలేదు. దాంతో బంతి బ్యాట్‌కు తగిలి చార్లెస్ హెల్మెట్‌ను తాకింది. బంతి తగిలిన వేగానికి హెల్మెంట్ గాల్లోకి ఎగిరింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన చార్లెస్ కాలితో హెల్మెట్‌ను తన్ని వికెట్ల మీద పడకుండా చూసుకున్నాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన సూర్య కుమార్ యాదవ్ ఫ్యాన్స్, ఒకరిలా ఆడడం ఎందుకు? నీ ఆట నువ్ ఆడొచ్చుగా. ఇంత ఇబ్బంది ఎందుకు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.