జూనియర్ రోహిత్ వచ్చేశాడు, మరోసారి తండ్రైన హిట్ మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. రోహిత్ సతీమణి రితికా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. రోహిత్ సతీమణి రితికా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్, రితికాలకు రెండో సంతానంగా వారసుడు ఇంట్లో అడుగుపెట్టాడు. ఇప్పటికే వారికి కూతురు సమైరా ఉంది. రోహిత్ శర్మకు మేనేజర్‌గా రితికా పనిచేసింది. ఆ టైమ్‌లోనే వారి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారడంతో 2015 డిసెంబర్‌లో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. 2018లో తొలి సంతానంగా సమైరా జన్మించింది. కాగా రెండోసారి తండ్రియిన రోహిత్ శర్మకు క్రికెట్ వర్గాలతో అభిమానులు శుభకాంక్షలు అందజేస్తున్నారు. జూనియర్ హిట్‌మ్యాన్ వచ్చేశాడు అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. భార్య డెలివరీ కారణంగా రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. డెలివరీ ముందుగానే జరగడంతో రోహిత్ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి.