Kapil Dev on Rohit Sharma: ఆ పొట్టేంటి రోహిత్.. కపిల్ దేవ్ సీరియస్
కెప్టెన్ రోహిత్ శర్మ పై విరుచుకు పడ్డాడు మాజీ కెప్టెన్ ,ఓల్డ్ కప్ విన్నర్ కపిల్ దేవ్. రోహిత్ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని..బరువు తగ్గాలని కపిల్ సూచించాడు.
ఆ పొట్ట ఏంటి…నువ్వెంటీ…. గ్రౌండ్ లో ఊపుకుంటూ తిరగడం ఏమిటి? అసలు నువ్వు స్పోర్ట్స్ మాన్ వేనా.?.. ఇలా కెప్టెన్ రోహిత్ శర్మ పై విరుచుకు పడ్డాడు మాజీ కెప్టెన్ ,ఓల్డ్ కప్ విన్నర్ కపిల్ దేవ్. రోహిత్ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని..బరువు తగ్గాలని కపిల్ సూచించాడు. ఎంత గొప్ప క్రికెటర్ ఐనా ఫిట్ నెస్ లేక పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు దేవ్. ఈ విషయం లో రోహిత్ తో పాటు టీమ్ మొత్తం కోహ్లీ ని చూసి నేర్చుకోవాలని, 10 ఏళ్లలో ఒకే రకమైన ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నాడని…కోహ్లీ సక్సెస్ కి ఫిట్నెస్ ప్రధాన కారణం అని కూడా చెప్పాడు మాజీ కెప్టెన్.
కపిల్ చెప్పింది నూటుకి నూరు పాళ్లు నిజం. రోహిత్ శర్మ తన రిస్ట్ పవర్ తో నెట్టుకొస్తున్నాడే తప్ప పూర్ ఫిట్నెస్ అనే చెప్పాలి. గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు పొట్ట బాగా కనిపిస్తుంది. బాడీ లాంగ్వాజ్ కూడా ఆక్టివ్ గా అనిపించదు. గ్రౌండ్ లో మొద్దుగా కాదులుతుంటాడు.ఒకప్పుడు పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్ , శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణతుంగ ఇలాగే ఉండేవారు. ఐతే టెక్నిక్…హాండ్ పవర్ తో సిక్సర్స్…ఫోర్లు ఉతికేస్తాడు కనుక రోహిత్ కి తిరుగులేకుండా పోయింది. కానీ కెప్టెన్ కి ఫిట్నెస్ లేక పోతే టీమ్ అంతా అలాగే తయారవుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
కోహ్లీ ఇవాళ వరల్డ్ క్రికెట్ లో ఫిట్నెస్ లో నెంబర్ వన్. గ్రౌండ్ లో చిరుత పులిలా కదులు తుంటాడు. ఫీల్డింగ్ కూడా అంతే. షార్ప్ ఫీచర్స్ వల్ల చూడగానే భలే ఉన్నాడు అనిపిస్తాడు. అప్పుడప్పుడు గ్రౌండ్ లో స్టెప్పులు…డాన్స్ లు సరే సరి. ఆ రోజు మాచ్ ఓడినా గెలిచినా జిమ్ కి వెళ్లడం మాత్రం మానను అని చెప్పే కోహ్లీ ని ఇప్పుడు వరల్డ్ క్రికెటర్లు అంత ఫాలో అవుతున్నారు. మరి రోహిత్ కి ఏమైంది. ? కపిల్ చెప్పినట్లు రోహిత్ ఇలాగే పొట్ట పెంచుకుంటే కొన్నాళ్ళకి క్రికెట్ కె గుడ్ బై చెప్పక తప్పదు.