దెబ్బ మామూలుగా లేదుగా కావ్యా పాప డిమాండ్ తో వారికి షాక్
ఐపీఎల్ మెగావేలానికి ముందు విదేశీ ప్లేయర్స్ కు బీసీసీఐ దిమ్మతిరిగే షాకిచ్చింది. వేలంలో రిజిష్టర్ చేసుకుని అమ్ముడైతే ఖచ్చితంగా సీజన్ ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది.

New rules are being introduced in the mega auction to be held before the IPL 2025 season.
ఐపీఎల్ మెగావేలానికి ముందు విదేశీ ప్లేయర్స్ కు బీసీసీఐ దిమ్మతిరిగే షాకిచ్చింది. వేలంలో రిజిష్టర్ చేసుకుని అమ్ముడైతే ఖచ్చితంగా సీజన్ ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. ఒకవేళ లేని గాయాన్ని సాకుగా చూపి, ఇతర కారణాలతోనైనా తప్పుకుంటే నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. బీసీసీఐ విదేశీ ప్లేయర్స్ విషయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యామారన్… గత వేలంలో సన్ రైజర్స్ శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగను 1.5 కోట్లకు దక్కించుకుంది. అయితే అంతకుముందు సీజన్ వరకూ హసరంగాను ఆర్సీబీ 10 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా… ఈ సారి బేస్ ప్రైస్ కే అమ్ముడయ్యాడు.
బేస్ ప్రైస్ కే అమ్ముడవడం నచ్చని హసరంగా గాయాన్ని సాకుగా చూపి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి వారితో జట్టు కాంబినేషన్ దెబ్బతింటోందని సన్ రైజర్స్ ఓనర్ కావ్యామారన్ కఠిన చర్యలకు డిమాండ్ చేసింది. ఆమె డిమాండ్ తో అంగీకరించిన బీసీసీఐ రెండేళ్ళపాటు నిషేధానికి నిర్ణయించింది. ఇకపై వేలంలో అమ్ముడైన తర్వాత సరైన కారణం చెప్పకుండా గాయాల పేరుతో తప్పుకుంటే మాత్రం రెండేళ్ళ పాటు ఐపీఎల్ లో ఆడే అవకాశముండదు. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో విదేశీ ప్లేయర్స్ షాక్ ఉన్నారు.