Kavya Papa : గంతులేసిన కావ్యా పాప
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మళ్లీ విజయాల బాట పట్టింది. హోం గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది.

Kavya Papa was stunned as Sunrisers Hyderabad won by one run
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మళ్లీ విజయాల బాట పట్టింది. హోం గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతికి రాజస్థాన్ విజయానికి రెండు పరుగులు కావాల్సి ఉండగా భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన యార్కర్‌తో పావల్ ను ఔట్ చేసి హైదరాబాద్ ను గెలిపించాడు. ఆఖరి బంతికి విజయం సాధించడంతో సన్‌రైజర్స్ ప్రాంచైజీ యజమాని కావ్య మారన్ (Kavya Maran) ఆనందంతో ఎగిరి గంతులేసింది. హుషారుగా నవ్వుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కావ్య పాపా మళ్లీ నవ్వింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజస్థాన్ తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో నిలిచింది.