Kedar Jadav: విరాట్ స్థానానికి పొగ.. ఎంట్రీ ఇస్తే మూడో స్థానంలో జాదవ్
టీమిండియా వెటరన్ క్రికెట్ కేదార్ జాదవ్ దాదాపు మూడేళ్ల నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జాదవ్.. తన కెరీర్ ఆరంభంలో పర్వాలేదనిపించాడు.

Kedar Jadhav, who plays for Team India and is currently playing in the Maharashtra Premier League
ఆ తర్వాత తన పేలవ ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ధోనీ ఆప్తమిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న జాదవ్ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ సీజన్‌లో జాదవ్ అదరగొట్టాడు. 5 ఇన్నింగ్స్‌లలో 110.6 సగటుతో 553 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా జాదవ్ ఆడాడు. ఆనూహ్యంగా ఆర్సీబీ తమ జట్టులో చేర్చుకుంది. ప్రస్తుతం జాదవ్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఈ లీగ్‌లో కోలాపూర్ టస్కర్స్‌కు జాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేదార్ జాదవ్ భారత జట్టులోకి తన రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని, అందుకు తగ్గట్టు కష్టపడతున్నాని 38 ఏళ్ల జాదవ్ తెలిపాడు. నాకు టాపర్డర్‌లో బ్యాటింగ్ చేయాలని ఉంది. నేను మహారాష్ట్ర తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్ చేస్తాను. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో అదే నాకు సరైన స్ధానం. ఆ స్ధానంలో బ్యాటింగ్ వస్తే నేను స్వేఛ్చగా ఆడగలను” అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం భారత జట్టులో విరాట్ కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాదవ్ చివరగా 2020లో భారత జట్టు తరపున ఆడాడు.