King Kohli : కింగ్ వచ్చేశాడు… ఇక ఫాన్స్ కు పండగే
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానుకుల గుడ్ న్యూస్. కోహ్లి భారత్‌కు తిరిగొచ్చాడు. ముంబై ఎయిర్‌పోర్టులో కోహ్లి అడుగుపెట్టిన వీడియో వైరల్‌గా మారింది.

King Kohli
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానుకుల గుడ్ న్యూస్. కోహ్లి భారత్‌కు తిరిగొచ్చాడు. ముంబై ఎయిర్‌పోర్టులో కోహ్లి అడుగుపెట్టిన వీడియో వైరల్‌గా మారింది. వచ్చీ రావడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంప్‌కు వెళ్ళిపోయిన కోహ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లి గత రెండు నెలలుగా టీమిండియాకు (Team India) దూరమయ్యాడు. తన సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో కలిసి కోహ్లి విదేశాల్లో ఉన్నాడు. ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావడంతో ఐపీఎల్ ఆడడేమో అన్న సందేహాలకు ముగింపు పలికినట్లైంది.
ఈ సీజన్ కోహ్లీ కెరీర్‌లో మరపురాని జ్ఞాపకంగా మారుతుందని పలువురు మాజీ ప్లేయర్స్ అభిప్రాయపదుతున్నారు. ఈ సారి ఆర్సీబీ ప్రత్యర్థి జట్లకు కోహ్లీ రూపంలో భారీ ముప్పు పొంచి ఉందని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు. కోహ్లీ నుంచీ 2016 తరహా మెరుపులు చూడొచ్చని వ్యాఖ్యానించాడు. ఆ ఏడాది ఐపీఎల్ (IPL) లో విరాట్ ఏకంగా 973 పరుగులు చేసాడు. ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏడాది విరామం అనంతరం ధోనీ, రెండు నెలల తర్వాత కోహ్లి తొలిసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.