King Kohli : ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు కింగ్ కోహ్లీ
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ప్లేయర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు.

King Kohli is the only one in IPL history
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ప్లేయర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. 2016 సీజన్‌లోనూ కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఆ సీజన్‌లో విరాట్ 973 పరుగులు బాదాడు. తాజా సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన విరాట్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అయితే ఫైనల్‌కు హాజరుకాని కోహ్లి తరఫున క్యాప్‌ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 61 సగటు, 141 స్ట్రైక్‌రేటుతో 741 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్ ఓవరాల్‌గా అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 2015, 2017, 2019 సీజన్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.