తొలి దెబ్బ ఎవరదో ? ఆరంభ మ్యాచ్ కు కేకేఆర్, ఆర్సీబీ రెడీ
క్రికెట్ ఫాన్స్ కు సమ్మర్ కార్నివాల్ వచ్చేసింది. మరో రెండు నెలల పాటు ఇక టీ ట్వంటీ వినోదమే...భారీ అంచనాల మధ్య ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కాబోతోంది.

క్రికెట్ ఫాన్స్ కు సమ్మర్ కార్నివాల్ వచ్చేసింది. మరో రెండు నెలల పాటు ఇక టీ ట్వంటీ వినోదమే…భారీ అంచనాల మధ్య ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కాబోతోంది. ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తలపడబోతున్నాయి.ఈ సీజన్ లో విజయమే లక్ష్యంగా కేకేఆర్, ఆర్సీబీ కొత్త సారథులతో బరిలోకి దిగుతున్నాయి. సీనియర్ బ్యాటర్ రహానే కేకేఆర్ కు సారథ్యం వహిస్తుండగా, రజత్ పటిదార్ ఆర్సీబీకి నాయకత్వం వహించనున్నాడు. దీంతో తొలి మ్యాచ్ లోనే కొత్త నాయకుల సారథ్యంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తలపడనుండడంతో… ఓపెనింగ్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో ఉత్సుకత మరింత ఎక్కువగా ఉంది.
ఈ మ్యాచ్ లో అందరి కళ్లు కోహ్లీపైనే. అతడే కీలక ఆటగాడు కూడా. దీంతో ఇప్పుడతడు ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేకేఆర్ పై ఇప్పటివరకు కోహ్లీ 962 పరుగులు చేశాడు.ఇంకా ఆర్సీబీ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్.. కొత్త బంతిని స్వింగ్ చేయడంలో దిట్ట. ఐపీఎల్ చరిత్రలో అతడు పవర్ ప్లేలో 71 అత్యధిక వికెట్లు తీశాడు.ఆర్సీబీ కెప్టెన్ పటిదర్ స్పిన్నర్లపై చెలరేగి ఆటగలడు. ఐపీఎల్ 2024 గత సీజన్ లో అతడు స్పిన్నర్లపై 197.24 స్టైక్ రేట్ తో విజృంభించాడు.ఇక కేకేఆర్‌లో వెంకటేశ్ అయ్యర్ అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా ఉన్నాడు. మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ని తిరిగి దక్కించుకోవడానికి కోల్‌కతా
రూ.23.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది.ఐపీఎల్ 2023లో 145.85 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేశాడు. 2024లో 158.80 స్ట్రైక్ రేట్‌తో 370 పరుగులు చేశాడు. 2023లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన కేకేఆర్ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు.
కేకేఆర్ లో సునీల్ నరైన్ అద్భుతంగా ఆడగలడు. అతడు 6.68 ఎకానమీతో ఆర్సీబీపై ఇప్పటివరకు 26 వికెట్లు తీశాడు.కేకేఆర్ లో మరో కీలకమైన ప్లేయర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అతడు కూడా స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. కాబట్టి ఆర్సీబీ ఇతడితో జాగ్రత్తగా ఉండాలి.వాతావరణ విషయానికొస్తే వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.