KL Rahul : ఆర్సీబీకి కెఎల్ రాహుల్ ? లక్నోను వీడటానికి కారణం ఇదే
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ ప్రక్షాళణకు శ్రీకారం చుట్టాయి. అయితే కొందరు ఆటగాళ్ళు మాత్రం తమ పాత ఫ్రాంచైజీలను గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ ప్రక్షాళణకు శ్రీకారం చుట్టాయి. అయితే కొందరు ఆటగాళ్ళు మాత్రం తమ పాత ఫ్రాంచైజీలను గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. తాజగా లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ కెఎల్ రాహుల్ గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఫ్రాంచైజీకి కూడా అతన్ని వదిలేసేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. గత సీజన్ సందర్భంగా ఫ్రాంచైజీ యాజమాన్యం , రాహుల్ మధ్య విభేధాలు తలెత్తాయి. సన్ రైజర్స్ తో ఓడిపోయినప్పుడు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా , రాహల్ మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీరి మధ్య విభేదాలున్నట్టు స్పష్టమైంది
ఈ కారణంగానే రాహుల్ లక్నోను వీడేందుకు సిద్ధమైనట్టు సమాచారం.. రాహుల్ సారథ్యంలో లక్నో రెండు సార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు రాహుల్‌ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డుప్లెసిస్ స్థానంలో రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. రాహుల్ ఆర్సీబీతోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.