KL RAHUL: మూడో టెస్టుకు ముందు భారత్ కు షాక్.. కెఎల్ రాహుల్ ఔట్
సీసీఐ మెడికల్ టీం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో కేఎల్ రాహుల్ ఫెయిలయ్యాడు. అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న రాహుల్.. నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
KL RAHUL: ఇంగ్లాండ్‌తో రాజ్ కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కూ దూరమయ్యాడు. గాయంతో రెండో టెస్టు నుంచి వైదొలిగిన రాహుల్‌ను ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్‌నెస్ సాధిస్తే తుది జట్టులో ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. బీసీసీఐ మెడికల్ టీం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో కేఎల్ రాహుల్ ఫెయిలయ్యాడు.
Suresh Raina, IVPL : రీ ఎంట్రీ ఇస్తున్న సురేష్ రైనా.. ఏ లీగ్ లో ఆడుతున్నాడంటే..
అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న రాహుల్.. నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ స్థానంలో కర్ణాటక ఎడమచేతి బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. పడిక్కల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై 193, గోవాపై 103 పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఇంగ్లాండ్ లయన్స్‌తో మ్యాచ్‌లోనూ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆరంభం నుంచి భారత్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకోగా.. శ్రేయస్ అయ్యర్ సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. ఆల్ రౌండర్ జడేజా గాయం నుంచి కోలుకుంటుండగా.. ఫిట్‌నెస్ సాధిస్తే మూడో టెస్టులో బరిలోకి దిగుతాడు.