ధోనీ,కోహ్లీ కాదు..రోహితే స్మార్ట్ కెెఎల్ రాహుల్ కామెంట్స్
భారత క్రికెట్ లో ఒక్కో కెప్టెన్ ది ఒక్కో స్టైల్... గత దశాబ్ద కాలంగా ధోనీ, కోహ్లీ, రోహిత్ లు టీమిండియాను అద్భుతంగా నడిపించారు. ఈ విషయంలో ఎవరికి వారే సాటిగా నిలిచారు.

భారత క్రికెట్ లో ఒక్కో కెప్టెన్ ది ఒక్కో స్టైల్… గత దశాబ్ద కాలంగా ధోనీ, కోహ్లీ, రోహిత్ లు టీమిండియాను అద్భుతంగా నడిపించారు. ఈ విషయంలో ఎవరికి వారే సాటిగా నిలిచారు. కానీ వీరి కెప్టెన్సీలో ఆడిన కొందరు ఆటగాళ్ళను ఎవరు బెస్ట్, స్మార్ట్ అని అడిగితే మాత్రం జవాబివ్వడానికి కాస్త తటపటాయిస్తుంటారు. అయితే స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ మాత్రం ఈ విషయంలో చాలా షార్ప్ గా సమాధానమిచ్చాడు.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే తెలివైన, స్మార్టెస్ట్ సారథి అని రాహుల్ కితాబిచ్చాడు. ర్యాపిడ్ రౌండ్ ఫైర్ లో కాసేపు కూడా ఆలోచించకుండా టక్కున రోహిత్ శర్మ అని చెప్పాడు. అందులో ఎటువంటి సందేహం లేదన్నాడు. రోహిత్ ది స్మార్టెస్ట్ బ్రెయిన్ అని కితాబిచ్చాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నమెంట్ లలో రోహిత్ శర్మ 27 మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించాడు. అందులో 24 మ్యాచుల్లో గెలవగా.. మూడు మ్యాచుల్లో ఓటమిని అందుకున్నాడు. తద్వారా ఐసీసీ టోర్నమెంట్ల చరిత్రలో కెప్టెన్ గా బెస్ట్ విన్ పర్సంటేజ్ ను సొంతం చేసుకున్నాడు. సారథిగా అతడి విజయ శాతం 88.88గా ఉంది.
అలానే తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరని అడగగా.. రషీద్ ఖాన్ అని బదులిచ్చాడు. నెట్స్ లో బౌలర్లందరిలో మహ్మద్ షమీ బంతులను ఎదుర్కోవడానికి తాను కష్టపడినట్లు వివరించాడు. అలాగే అభిషేక్ నాయర్ తన ఫేవరెట్ పర్సన్ గా చెప్పుకొచ్చాడు. క్రికెట్ గురించి మాట్లాడేందుకు, అతని సలహాలు తీసుకునేందుకు ఇష్టపడతానని రాహుల్ చెప్పాడు. అభిషేక్ నాయర్ ప్రస్తుతం టీమిండియాకు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే రాహుల్ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ గా రాణిస్తున్నాడు. రిషబ్ పంత్ ను ప్రధాన వికెట్ కీపర్ గా ఎంపిక చేసినా తుది జట్టు కాంబినేషన్ లో పంత్ ను తప్పించి రాహుల్ కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పంత్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు.