తండ్రయిన కెఎల్ రాహుల్, ఢిల్లీ జట్టులో చేరేది అప్పుడే

టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని భార్య అతియా షెట్టి సోమవారం పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాహుల్ అభిమానులతో పంచుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 01:36 PMLast Updated on: Mar 25, 2025 | 8:47 PM

Kl Rahul The Father Was Just About To Join The Delhi Team

టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని భార్య అతియా షెట్టి సోమవారం పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాహుల్ అభిమానులతో పంచుకున్నాడు. డెలివరీ సమయంలో భార్య దగ్గరగా ఉండేందుకు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌ నుంచి అతను తప్పుకున్నాడు. అథియా ప్రెగ్నెన్సీ వార్తని 2024 నవంబర్ 8న ఈ దంపతులు అనౌన్స్ చేశారు. త్వరలోనే అథియా బిడ్డకు జన్మనివ్వబోతుందని.. తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం నేరుగా తన భార్యని చూసేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలో అతియా ప్రెగ్నెంట్ కావడంతో ప్రేమగా ఆమె ఒడిలో పడుకుని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోని షేర్ చేసిన పది రోజుల్లోనే ఇప్పుడు ఆమె పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిందనే శుభవార్తని తన అభిమానులకు తెలియజేశాడు కేఎల్ రాహుల్. భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా తొలి సంతానంగా అమ్మాయిలే పుట్టారు. ఇప్పుడు ఈ లిస్టులో కె. ఎల్. రాహుల్ కూడా చేరాడు.బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అథియా శెట్టి, 2015లో వచ్చిన ‘హీరో’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన అథియా శెట్టి, 2023 జనవరి 23న క్రికెటర్ కెఎల్ రాహుల్‌ని పెళ్లాడింది. సీక్రెట్ గా లవ్ ఎఫైర్ నడిపించిన ఈ ఇద్దరు.. 2021 లో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులను ఒప్పించి 2023 జనవరి 23న వివాహం చేసుకున్నారు.

ఇక అతియా ప్రసవం కోసమే కేఎల్ రాహుల్ ఈ ఐపిఎల్ సీజన్ లోని తొలి మ్యాచ్ కి దూరం అయ్యాడు. ఇక గత మూడు సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కి ఆడిన కేఎల్ రాహుల్ ని.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 14 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తరువాత ఢిల్లీ కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చేందుకు ఆశ చూపించినప్పటికీ.. తాను సాధారణ ప్లేయరుగానే ఐపిఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే రాహుల్ ఢిల్లీ ఆడే రెండో మ్యాచ్ కు జట్టుతో చేరనున్నాడు. మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుండగా.. ఆ మ్యాచ్ కు అతను అందుబాటులో ఉంటాడని డీసీ వర్గాలు తెలిపాయి.