సొంత లీగ్ లో క్లాసెన్ ఫ్లాప్ షో, కావ్యాపాపకు రూ.23 కోట్లు బొక్కేనా ?
గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో అభిమానులు మరిచిపోలేదు.
గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో అభిమానులు మరిచిపోలేదు. ఒంటిచేత్తో సన్ రైజర్స్ కు అద్భుత విజయాలను అందించాడు. సన్ రైజర్స్ టీమ్ ఫైనల్ కు చేరడంలో ఈ సఫారీ క్రికెటర్ కీలకపాత్ర పోషించాడు. అందుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. హెన్రీచ్ క్లాసెన్‌ను రూ. 23 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోనూ క్లాసెన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ ఆకట్టుకున్న క్లాసెన్ ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు రిటైన్ చేసుకున్న ప్లేయర్ గా నిలిచాడు. అలాంటి క్లాసెన్ ఉన్నట్టుండి ఒక్కసారి ఫామ్ కోల్పోయాడు. సౌతాఫ్రికా 20లీగ్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఈ టోర్నీలో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హెన్రీచ్ క్లాసెన్ గత 4 మ్యాచ్‌ల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటి వరకూ టోర్నీలో అతని హయ్యెస్ట్ 29 రన్స్ గా ఉంటే… మిగిలిన మూడింటిలోనూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు.
క్లాసెన్ పేలవ ఫామ్ ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే అతని పేలవ ఆట తీరు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. సొంత లీగ్‌లోనే విఫలమవుతుంటే మరో రెండు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ సమయానికి ఫామ్‌లోకి వస్తాడా అనే డౌట్స్ మొదలయ్యాయి. 23 కోట్లు పెట్టి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న క్లాసన్ ఆడకపోతే సన్ రైజర్స్ భారీగా నష్టపోయినట్టే. ఈ లీగ్ లో మిడిల్ ఆర్డర్ లో క్లాసన్ పై సన్ రైజర్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. టాపార్డర్ బలంగా ఉన్నప్పటికీ.. బలహీనంగా ఉన్న మిడిల్ ఆర్డర్ భారం క్లాసన్ మోయాల్సిందే.
క్లాసెన్‌తో పాటు ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ఈ ఐదుగురి కోసమే సన్‌రైజర్స్ 75 కోట్లు ఖర్చు చేసింది. బ్యాటింగ్ లో నలుగురు కీలకం కానుండగా.. బౌలింగ్ లో కమ్మిన్స్ పై ఆశలు పెట్టుకుంది. అయితే నలుగురు బ్యాటర్లలో సన్‌రైజర్స్ టీమ్ కు ఇబ్బందులు తప్పవు. పైగా క్లాసెన్ పేలవ ఫామ్ తో కావ్యా మారన్ కు 23 కోట్ల నష్టమేనంటూ చర్చ మొదలైంది.