రన్ మెషీన్ పరుగుల వేట సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ ఫామ్ అందుకున్నాడు. అహ్మదాబాద్ వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. అందరూ ఆశించినట్లుగా కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ ఫామ్ అందుకున్నాడు. అహ్మదాబాద్ వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. అందరూ ఆశించినట్లుగా కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 55 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. ముఖ్యంగా స్పిన్ వేసే రూట్ బౌలింగ్ లో కోహ్లి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఫ్లిక్, కవర్ డ్రైవ్, స్వీప్ తో బౌండరీలు రాబట్టాడు. చాలారోజుల తర్వాత ఫిఫ్టీ చేసిన కోహ్లీ ఈ క్రమంలో పలు రికార్డులను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను కోహ్లీ అధిగమించాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 4000 ప్లస్ రన్స్ చేయగా.. సచిన్ టెండూల్కర్ 3990 రన్స్ చేశాడు.సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలపై అంతర్జాతీయ క్రికెట్‌లో మూడువేలకు పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాపై 5000 ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ.. ఇంగ్లండ్‌పై 4000 ప్లస్ రన్స్, సౌతాఫ్రికాపై 3000 ప్లస్ రన్స్ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు దేశాలపై 4000 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికీ పాంటింగ్ రికార్డ్‌ను సమం చేశాడు.
కోహ్లీ, పాంటింగ్ చెరో మూడు దేశాలపై 4000 ప్లస్ రన్స్ చేయగా.. సచిన్ రెండు దేశాలపై ఈ ఫీట్ సాధించాడు. ఆసియా గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డ్‌ను కోహ్లీ అధిగమించాడు. సచిన్ 353 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధిస్తే.. కోహ్లీ 340 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. సెంచరీ దిశగా సాగేలా కనిపించిన కోహ్లీని మరోసారి లెగ్ స్పిన్నర్ రషీద్ ఔట్ చేశాడు. రషీద్ బౌలింగ్ లో ఔట్ అవ్వడం కోహ్లీ కెరీర్ లో ఇది పదోసారి. భారత స్టార్ బ్యాటర్‌ను 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు ఔట్ చేసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. అతడికంటే ముందు టిమ్ సౌథీ, జోష్ హేజిల్‌వుడ్, మొయిన్అలీ, జేమ్స్ అండర్సన్ ఈ జాబితాలో ఉన్నారు.