విరాట పర్వం మొదలైనట్టేనా ? ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు... అహ్మదాబాద్ వన్డేలో కోహ్లీ ఫిఫ్టీ కొట్టిన తర్వాత ఫ్యాన్స్ ఇలాగే అనుకున్నారు... దాదాపు ఏడాదికి పైగా రన్ మెషీన్ మూగబోయి , విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 02:50 PMLast Updated on: Feb 13, 2025 | 2:50 PM

Kohli Came Into Form

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు… అహ్మదాబాద్ వన్డేలో కోహ్లీ ఫిఫ్టీ కొట్టిన తర్వాత ఫ్యాన్స్ ఇలాగే అనుకున్నారు… దాదాపు ఏడాదికి పైగా రన్ మెషీన్ మూగబోయి , విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఒకప్పటి కోహ్లీని గుర్తుకు తెస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీకి ముందు హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చేశాడు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా విరాట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. గత ఏడాది కాలంగా భారీ ఇన్నింగ్స్ లే లేవు.. ఆసీస్ టూర్ లో పెర్త్ వేదికగా సెంచరీ తప్పిస్తే మిగిలిన సిరీస్ అంతా నిరాశపరిచాడు.

అంతకుముందు స్వదేశంలో సైతం ఇదే పరిస్ఖితి.. దీంతో రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడంటూ విమర్శలు… యువ ఆటగాళ్ళకు అవకాశామివ్వాలంటూ సలహాలు.. ఇలాంటి ఒత్తిడితో ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు ఫోకస్ మొత్తం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపైకి షిఫ్ట్ అయింది. మోకాలి వాపుతో ఇంగ్లండ్ తో తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. రెండో వన్డేలో 5 పరుగులే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే ఇదే కాబట్టి ఈ మ్యాచ్ లో కోహ్లి ఫామ్ అందుకోవాలని మేనేజ్ మెంట్ బలంగా కోరుకుంది. చివరికి వారి ఆకాంక్షను నిజం చేస్తూ కోహ్లీ మంచి ఇన్నింగ్సే ఆడాడు. కాన్ఫిడెంట్ గా షాట్లు కొట్టాడు.

విమర్శలు, ఇతర ఒత్తిడి అంతా పక్కన పెట్టి మునుపటి కోహ్లీని ఫ్యాన్స్ కు చూపించాడు. ఈ క్రమంలో 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ కెరీర్ లో ఇది 73వ వన్డే హాఫ్ సెంచరీ. గిల్ తో కలిసి రెండో వికెట్ కు 116 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పిన కోహ్లీ 52 రన్స్ కు ఔటయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ విరాట్ నామజపంతో స్టేడియం హోరెత్తిపోయింది. విరాట్ సింగిల్ తీసినా కూడా ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. అయితే బిగ్గెస్ట్ స్టేడియంలో కోహ్లీ శతకం చూడాలనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫామ్ లోకి రావడం ఖచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ పెంచుతుంది.