ఆస్ట్రేలియన్ మీడియాపై కోహ్లీ ఫైర్, మెల్‌బోర్న్‌ ఎయిర్​పోర్టులో రచ్చ రచ్చ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మనదేశంలోనే కాకా విదేశాల్లోనూ అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ కారణంగా కోహ్లీ ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఈ మధ్య అతనిని మీడియా జర్నలిస్టులు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అంటూ వెంటపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2024 | 08:02 PMLast Updated on: Dec 19, 2024 | 8:02 PM

Kohli Fires At Australian Media

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మనదేశంలోనే కాకా విదేశాల్లోనూ అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ కారణంగా కోహ్లీ ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఈ మధ్య అతనిని మీడియా జర్నలిస్టులు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అంటూ వెంటపడుతున్నారు.

ప్రస్తుతం కింగ్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. గబ్బాలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ సమమైంది. మిగతా రెండు మ్యాచ్ లు ఇరు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో టీమిండియా నాలుగో టెస్ట్ కోసం మెల్‌బోర్న్‌కు చేరుకుంది. మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియన్ మీడియా ఇబ్బంది పెట్టింది. ఈ సమయంలో విరాట్ సహనం కోల్పోయాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబందించిన ఫోటోలు వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఇష్యూ కాస్త చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ ఎం జరిగిందంటే.. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో క్రికెటర్ల ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు తీస్తుండగా దానికి కోహ్లీ అడ్డుపడ్డాడు. తమ కుటుంబ సభ్యుల ఫోటోలు తీయొద్దంటూ మీడియాను కోరాడు. దానికి మీడియా విమానాశ్రయం పబ్లిక్ ప్లేస్ అని వాదించింది. దీంతో మీడియా కోహ్లీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కోహ్లి తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా కోహ్లీ, ఆఖయ్ కోహ్లీతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.గతంలోనూ ఇలాంటి ఘటనలు కోహ్లీ ఫ్యామిలీకి ఎదురయ్యాయి. కుటుంబ సభ్యుల ఫోటోలను బహిరంగ పరిచడం కోహ్లీకి ఇష్టముండదని ఇండియన్ మీడియా వాళ్ళ ఫోటోలను తీయడం మానేసింది. అయితే ఆస్ట్రేలియా మీడియా రూల్స్ మాట్లాడటంతోనే కోహ్లీ కాస్త ఘాటుగా చెప్పాల్సి వచ్చింది.