ఒంటరిగా ఏడుస్తూ ఉండాలా ? బీసీసీఐ రూల్స్ పై కోహ్లీ ఫైర్
ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఫ్లాప్ షో తర్వాత బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆటగాళ్ళ కుటుంబసభ్యులు ఎక్కువరోజులు ఉండేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించింది.

ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఫ్లాప్ షో తర్వాత బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆటగాళ్ళ కుటుంబసభ్యులు ఎక్కువరోజులు ఉండేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించింది. దీనిపై అప్పుడే రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్స్ చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ రూల్స్ పై మరోసారి చిరాకు పడ్డాడు. ఆటగాళ్ల నుంచి ఫ్యామిలీ మెంబర్లను దూరం చేయడం సరి కాదని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టూర్ లో భారత ఘోర ప్రదర్శన తర్వాత బీసీసీఐ చాలా మార్పులు చేసింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడటం, అందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణించడం, వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించడం, లగేజీలో కోతతోపాటు ఆటగాళ్లు తమ వెంట ఫ్యామిలీ మెంబర్లను తీసుకెళ్లే విషయంపై కూడా కఠిన నిబంధనలు విధించింది. 45 రోజులలోపు జరిగే పర్యటనలకు ఫ్యామిలీ మెంబర్లను అనుమతించరు. అదే ఒక పర్యటన 45 రోజుల కంటే ఎక్కువగా జరిగితే కేవలం రెండు వారాలపాటు మాత్రమే తమతో ఫ్యామిలీ మెంబర్లు ఉండేలా ఆటగాళ్లకు రూల్స్ తీసుకొచ్చింది. ఫ్యామిలీస్ పై ఆంక్షలు విధించాడన్ని కోహ్లీ తప్పుపట్టాడు.
విదేశీ టూర్లలో తమతో పాటు ఫ్యామిలీ మెంబర్ల ఉంటే, ఆటలో ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ తనతోపాటు ఉండేదుంకు ప్రాధాన్యం ఇస్తానని కోహ్లీ తెలిపాడు. ఆటగాళ్లకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఓదార్పు నివ్వడానికి, తిరిగి గాడిన పడేందుకు ఫ్యామిలీ సభ్యులు అందుబాటులో ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. తను మాత్రం ఎక్కడికి వెళ్లినా, ఫ్యామిలీ మెంబర్లతో వెళ్లేందుకే ప్రాధన్యత ఇస్తానని స్పష్టం చేశాడు. ఆటగాళ్లతో ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల బ్యాలెన్స్, మెంటల్ స్టెబిలిటీ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీని గురించి కొంతమందికి తెలీదనీ, అందుకే ఏదేదో మాట్లాడేస్తుంటారని విమర్శించాడు. క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరముందని కొందరు అనడం కూడా కాస్త నిరాశకు గురి చేస్తోందని చెప్పడు. పర్యటనలో ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడన్నాడు. తానయితే బయటకు వెళ్లి ఫ్యామిలీతో గడిపే సమయాన్ని, అవకాశాలను వదులుకోన విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్లో ప్రక్షాళనే లక్ష్యంగా 10 పాయింట్లతో కూడిన రూల్స్ ను రూపొందించి, అవి కచ్చితంగా పాటించాలని ఆటగాళ్లను బీసీసీఐ ఆదేశించింది. బీసీసీఐ రూపొందించిన రూల్స్ లో.. క్రికెటర్స్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఉంది. విదేశీ పర్యటనలు చేసేటప్పుడు.. క్రికెటర్స్ వెంటపెట్టుకుని తీసుకెళ్లిన ఫ్యామిలీ మెంబర్ నిర్ణీత సమయం మాత్రమే ఉండాలని పరిమితులు విధించింది. ఈ రూల్స్ చాలా ప్లేయర్స్ కు నచ్చలేదు. చీఫ్ సెలక్టర్ అగార్కర్ తో పాటు కోచ్ గంభీర్ తో సైతం దీనిపై రోహిత్ , కోహ్లీ ఇప్పటికే సీరియస్ గా మాట్లాడినట్టు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనూ బోర్డు ఈ రూల్స్ ను కఠినంగానే అమలు చేసింది. అయితే ఐపీఎల్ లో కూడా ఇవే ఆంక్షలు కొనసాగేలా ఆదేశాలిచ్చింది. కానీ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్ కు దీనిపై బీసీసీఐ ఏదైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.