King Kohli : కోహ్లీ హాఫ్ సెంచరీల సెంచరీ..
చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వేదికగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.
చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వేదికగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీ (RCB) విజయంలో విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్‌లు కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (King Kohli) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో కార్తీక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ అరుదైన రికార్డులు అందుకున్నాడు. టీ20ల్లో 100 సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా వరల్డ్‌క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో విరాట్ మూడో స్ధానంలో ఉన్నాడు.
తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉండగా.. ఆ తర్వాతి స్ధానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు.