రంజీ ట్రోఫీ బరిలో కోహ్లీ,పంత్ ? ఢిల్లీ ప్రాబబుల్స్ లిస్ట్ రిలీజ్
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ , రిషబ్ పంత్ రంజీ ట్రోఫీ ఆడబోతున్నారా... అవునని ఖచ్చితంగా చెప్పలేకున్నా ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్ జాబితాలో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ ప్రాబబుల్స్ లో కోహ్లీ, పంత్ ను కూడా చేర్చారు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ , రిషబ్ పంత్ రంజీ ట్రోఫీ ఆడబోతున్నారా… అవునని ఖచ్చితంగా చెప్పలేకున్నా ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్ జాబితాలో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ ప్రాబబుల్స్ లో కోహ్లీ, పంత్ ను కూడా చేర్చారు. అయితే వీరిద్దరూ ఖచ్చితంగా రంజీ మ్యాచ్ లు ఆడడం అనుమానంగానే ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తో సిరీస్ తర్వాత న్యూజిలాండ్ తో మూడు టెస్టులు జరగనున్నాయి. ఇది ముగిసిన వెంటనే భారత్ సౌతాఫ్రికాలో టీ ట్వంటీ సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా వెళుతుంది. ఈ మధ్యలో కొన్ని రోజులే ఖాళీ దొరికినా కోహ్లీ రంజీ బరిలో దిగడం డౌటే.
సీనియర్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని కొత్త కోచ్ గంభీర్ స్పష్టం చేసినప్పటకీ… కోహ్లీ, బూమ్రా, రోహిత్ లకు బీసీసీఐ వెసులుబాటు ఇచ్చింది. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012-13 సీజన్‌లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఇప్పుడు కివీస్ తో టెస్ట్ సిరీస్ జరగనున్న సమయంలోనే రంజీ ట్రోఫీ షెడ్యూల్ ఉంది. ఆ సిరీస్ ను కాదని వీరిద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడే ఛాన్స్ లేదు. అయినప్పటకీ రంజీ ట్రోఫీకి అవకాశం ఉన్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లి, రిషబ్ పంత్ పేర్లు చేర్చడం ఆశ్చర్యపరిచింది. కాగా కోహ్లీ 9 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వగా… వికెట్ కీపర్ రిషబ్ పంత్ దాదాపు 629 రోజుల తర్వాత టెస్ట్ ఫార్మాట్ లోకి తిరిగి వచ్చాడు. చెన్నైతో తొలి టెస్టులో కోహ్లీ నిరాశపరిచినా… పంత్ మాత్రం సెంచరీతో అదరగొట్టాడు.