కోహ్లీ రికార్డులే రికార్డులు, అందుకే కదా నువ్వు కింగ్
రికార్డులు అతని ఇంటి అడ్రస్... రికార్డుల్లో అతని పేరు ఉండడం కాదు... అతని పేరు మీదే రికార్డులుంటాయి... భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఈ కొటేషన్ సరిగ్గా సరిపోతుంది...

రికార్డులు అతని ఇంటి అడ్రస్… రికార్డుల్లో అతని పేరు ఉండడం కాదు… అతని పేరు మీదే రికార్డులుంటాయి… భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఈ కొటేషన్ సరిగ్గా సరిపోతుంది…సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజుగా నిలిచిన కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమైనప్పటి నుంచి దుమ్మురేపుతున్నాడు. పాక్ తో మ్యాచ్ శతక్కొట్టిన విరాట్ ఇప్పుడు సెమీఫైనల్లో ఆసీస్ పై అదరగొట్టేశాడు. ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఛేజింగ్‌లో 8000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 8720 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 8000 ప్లస్ రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరికి దరిదాపుల్లో మరే బ్యాటర్ లేడు. రోహిత్ శర్మ 6115 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. సనత్ జయసూర్య, జాక్వస్ కల్లీస్ పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఛేజింగ్ అంటే పండుగ చేసుకునే విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఛేజింగ్‌లో 159 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 40 శతకాలతో 8000 ప్లస్ రన్స్ చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ రికార్డ్ సాధించాడు. ఐసీసీ వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలోనే అతను సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. సచిన్ 23 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లీ 24 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఇది 7వ 50+ స్కోరు. శిఖర్ ధావన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ ఆరేసి సార్లు ఈ ఫీట్ సాధించారు. అలాగే ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీకి ఇది 5వ 50+ స్కోరు కాగా ఓవరాల్‌గా ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 10వది. స్టీవ్ స్మిత్ 6, సచిన్ టెండూల్కర్ 6 సార్లు ఈ ఫీట్ సాధించి, తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
వన్డేల్లో మూడవ స్థానంలో 12 వేలకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు రికీ పాంటింగ్ 330 ఇన్నింగ్స్‌ల్లో 12,662 వన్డే పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 234 ఇన్నింగ్స్‌ల్లో 12 వేల పరుగులు చేశాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 1000+ పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ 808, రికీ పాంటింగ్ 731, సచిన్ టెండూల్కర్ 657 పరుగులతో ఉన్నారు. ఇక వన్డేల్లో ఛేదనలో 8 వేల పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. వన్డేల్లో 33 మంది ప్లేయర్లు, 8 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ కేవలం ఛేదనలోనే 8 వేల పరుగులు చేశారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో 50+ స్కోర్లు సాధించిన ఏకైక ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.
అంతకుముందు ఫీల్డింగ్ సందర్బంగా విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ క్యాచ్‌ను అందుకొవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో జోష్ ఇంగ్లీస్‌తో పాటు నాథన్ ఎలిస్ క్యాచ్‌లు అందుకున్న కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో కలిపి 336 క్యాచ్‌లతో భారత్ తరఫున టాప్‌లో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.