Kohli : కోహ్లీని స్లెడ్జింగ్ చేయండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సలహా
ఇంగ్లండ్(England)తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్ సిరీస్(High Voltage Series)లో తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్(England)తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ హైవోల్టేజ్ సిరీస్(High Voltage Series)లో తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న ఇంగ్లాండ్ భారత్ (England vs India) పై సిరీస్ గెలిచేందుకు పట్టుదలగా ఉంది. దీని కోసం మానసికంగా పై చేయి సాధించేందుకు ఆ దేశ మాజీలు సలహాలు ఇస్తున్నారు. తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో మైండ్ గేమ్స్ ఆడాలని, అతడి ఈగోపై దెబ్బ కొట్టాలని ఇంపనేసర్ సూచించాడు.
గత 10 ఏళ్లగా ఐసీసీ టైటిల్స్ (ICC titles) ను గెలవకపోయిన విషయాన్ని అతడికి పదేపదే గుర్తు చేయాలిని వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కి వచ్చేసరికి ఓడిపోతారంటూ… ఛోకర్స్ అంటూ అతడిని స్లెడ్జింగ్ చేయాలన్నాడు. అప్పుడు విరాట్ తన ఏకగ్రాతను కోల్పోతాడనీ చెప్పుకొచ్చాడు. దీంతో అతన్ని ఔట్ చేయడం సులభమవుతుందన్నాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో కోహ్లికి, ఇంగ్లండ్ పేసరి అండర్సన్‌కు మధ్య గట్టి పోటీ ఉంటుందని పనేసర్ అభిప్రాయపడ్డాడు.టెస్టుల్లో విరాట్‌పై పనేసర్‌కు మంచి రికార్డు ఉంది. అండర్సన్ ఇప్పటివరకు 7 సార్లు ఔట్ చేశాడు. అయితే కోహ్లీని రెచ్చగొడితే ఇంగ్లాండ్ మూల్యం చెల్లించుకుంటుందంటూ భారత్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇలా చేసే చావుదెబ్బ తిన్నారంటూ గుర్తు చేస్తున్నారు.