లాస్ట్ ప్లేస్ లో కోల్ కత్తా, టేబుల్ టాపర్ గానే ఆర్సీబీ
ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న జట్లలో కొన్ని మాత్రమే సత్తా చాటుతుంటే మరికొన్ని డీలా పడ్డాయి. ప్రస్తుతం 12 మ్యాచ్ లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో పలు టాప్ టీమ్స్ కింది నుంచి మూడు, నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న జట్లలో కొన్ని మాత్రమే సత్తా చాటుతుంటే మరికొన్ని డీలా పడ్డాయి. ప్రస్తుతం 12 మ్యాచ్ లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో పలు టాప్ టీమ్స్ కింది నుంచి మూడు, నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన కోల్ కత్తా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మూడు మ్యాచ్ లలో కేవలం ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న కేకేఆర్ టీమ్ 10వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఈసారి పాయింట్ల పట్టికలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఐదు సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో టాప్-4లో లేవు. ఇప్పటివరకు టాప్-4లో ఉన్న జట్లలో మూడు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు.
ముఖ్యంగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సారి తొలి వారంలోనే రెండు వరుస విజయాలు అందుకుంది. తద్వారా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించింది. రెండో ప్లేసులో ఢిల్లీ క్యాపిటల్స్ కంటిన్యూ అవుతోంది..అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచులలో గెలిచింది. ఆ తర్వాత లక్నో.. గుజరాత్ నిలిచాయి. .రెండు మ్యాచులలో ఒక్కోటి చొప్పున గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఐదో స్థానంలో ఉంది. ఆడిన ఒక మ్యాచ్ లోనూ అద్భుత విజయాన్ని అందుకున్న పంజాబ్ టాప్ 4 నిలవడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆశ్చర్యమేమిటంటే మిగిలిన జట్లతో పోలిస్తే ఆలస్యంగా తొలి విజయాన్ని అందుకున్న ముంబై పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కోల్ కత్తాపై భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ జట్టు రన్ రేట్ చెన్నై కంటే మెరుగ్గా ఉంగి. మరోవైపు ముంబైపై గెలిచి టోర్నీని గ్రాండ్ స్టార్ట్ చేసిన చెన్నై తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో మైనస్ 0.771 రన్ రేట్ తో ఏడో ప్లేస్ లో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కో విజయమే సాధించినా రన్ రేట్ విషయంలో వెనుకబడ్డాయి. ఏది ఏమైనా ఇది టోర్నీ ఆరంభం మాత్రమే.. ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లు అదే జోరు కొనసాగించి ప్లే ఆఫ్స్ చేరతాయా అనేది వేచి చూడాలి.