కోలకత్తా వర్సెస్ రాజస్థాన్ తొలి విజయం దక్కేదెవరికి ?

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజుల్లో మ్యాచ్ లు పెద్దగా ఆసక్తికరంగా జరగకపోయినా... మూడో రోజు ఢిల్లీ, లక్నో మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ కు అసలు సిసలు టీ ట్వంటీ మజానిచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 07:34 PMLast Updated on: Mar 25, 2025 | 7:34 PM

Kolkata Vs Rajasthan Who Will Get The First Win

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజుల్లో మ్యాచ్ లు పెద్దగా ఆసక్తికరంగా జరగకపోయినా… మూడో రోజు ఢిల్లీ, లక్నో మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ కు అసలు సిసలు టీ ట్వంటీ మజానిచ్చింది. ఇక అన్ని జట్లు తలో ఒక మ్యాచ్ ఆడేసిన నేపథ్యంలో ఇప్పుడు రెండో మ్యాచ్ లకు రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ బుధవారం తలపడబోతున్నాయి. గుహావటి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు కూడా తమ తమ తొలి మ్యాచ్ లలో పరాజయం పాలయ్యాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ , ఆర్సీబీ చేతిలో ఓడిపోతే… రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై పరాజయం పాలైంది. దీంతో ఇరు జట్లు తొలి విజయం కోసం పట్టుదలగా ఉన్నాయి.

కోల్ కత్తా నైట్ రైడర్స్ కీలక బ్యాటర్లు తొలి మ్యాచ్ లో చేతులెత్తేశారు. రహానే , నరైన తప్పిస్తే మిగిలిన ప్లేయర్స్ నిరాశపరిచారు. డికాక్ , వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్ ఫామ్ అందుకుంటే తప్ప కోల్ కత్తా విజయంపై ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. అటు బౌలింగ్ లోనూ నైట్ రైడర్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సునీల్ నరైన్ తప్పిస్తే మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా ఫెయిలయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వైభవ్ ఆరోరా సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ అందుకోకుంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ను కట్టడి చేయడం కష్టమే. అయితే రహానే మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకోవడం ఒక్కటే తొలి మ్యాచ్ లో కోల్ కత్తాకు అనుకూలమైన అంశంగా మిగిలింది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ది కాస్త భిన్నమైన పరిస్థితి… ఆ జట్టు బౌలింగ్ లో తేలిపోయినా బ్యాటింగ్ లో మాత్రం అదరగొట్టింది. సన్ రైజర్స్ పై చివరి వరకూ పోరాడి ఓడిపోయింది. రాయల్స్ బౌలర్లలో ఒక్కరు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే తన 4 ఓవర్ల స్పెల్ లో ఏకంగా 76 రన్స్ ఇచ్చేశాడు. ఫరూఖీ, తీక్షణతో పాటు గత సీజన్ లో ఆకట్టుకున్న సందీప్ శర్మ సైతం ఫ్లాపయ్యాడు. వీరంతా ఓవర్ కు 12కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. అందుకే రాయల్స్ బౌలర్లు ఖచ్చితంగా గాడిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే బ్యాటింగ్ లో మాత్రం రాజస్థాన్ పర్వాలేదనిపించింది.. సన్ రైజర్స్ స్కోరుకు ధీటుగా 242 పరుగుల వరకూ స్కోర్ చేసింది. కానీ జైశ్వాల్, రియాన్ పరాగ్ , నితీశ్ రాణా ఫెయిలయ్యారు. అయితే సంజూ శాంసన్, ధృవ్ జురెల్, హిట్ మెయిర్ మాత్రం అదరగొట్టారు. వీరికి తోడు టాపార్డర్ కూడా రాణిస్తే రాజస్థాన్ కు తిరుగుండదు.

ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ 30 సార్లు తలపడితే చెరో 14 సార్లు గెలిచాయి.. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇక మ్యాచ్ తు ఆతిథ్యమిస్తున్న గుహావటి పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ లో మొగ్గుచూపినా 170-180 స్కోర్ ఈ పిచ్ పై కాంపిటేటివ్ టోటల్ గా అంచనా వేస్తున్నారు.