పేస్ వేగంతో స్పిన్ బౌలింగ్, బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్న కృనాల్

ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 03:20 PMLast Updated on: Apr 08, 2025 | 4:10 PM

Krunal Is Confusing The Batters With His Spin Bowling At A Fast Pace

ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. చివరి బంతి వరకూ విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడుతూ అసలైన ఐపీఎల్ మజాను అందించింది. నిజానికి ఈ మ్యాచ్ లో పాండ్యా , తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ కు ఆర్సీబీ ఓడిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆర్సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా తన బౌలింగ్ మ్యాజిక్ తో జట్టును గెలిపించాడు. వైవిధ్యమైన స్పీడ్ తో బంతులు వేస్తూ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు.

అతను ఏ బంతిని ఎంత వేగంతో వేస్తాడో చెప్పడం కష్టమన్నది ఈ సీజన్ లో మరోసారి రుజవైంజి. కొన్నిసార్లు సాధారణ వేగంతో వేస్తే.. మరొకొన్ని సార్లు మాత్రమే అతని బౌలింగ్ స్పీడ్ 100 దాటుతుంది. ఈ సీజన్ లోనూ క్రునాల్ తన బంతులతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ముంబైతో మ్యాచ్ లో ఏకంగా 117 కి. మీ స్పీడ్ తో బంతి వేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇన్నింగ్స్ 10 యువర్ నాలుగో బంతిని కృనాల్ 117 కి.మీ వేగంతో బౌన్సర్ విసిరాడు. ఈ బంతిని పుల్ షాట్ ఆడిన జాక్స్ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కృనాల్ వేసిన ఈ అనూహ్య బౌన్సర్ కు జాక్స్ దొరికిపోయాడు. అంతే కాదు మ్యాచ్ లో చివరి ఓవర్ ను సైతం అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై జోరుకు బ్రేక్ వేసింది కూడా కృనాలే…

ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 19 పరుగులు కావాల్సి వచ్చింది. బంతిని అందుకున్న కృనాల్ ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి బంతిని మిచెల్ శాన్‌ట్నర్ భారీ షాట్ ఆడగా.. సరిగ్గా బౌండరీని ఆనుకుని ఉన్న టిమ్ డేవిడ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాతి బంతిని దీపక్ చాహర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ వైపు గాల్లోకి లేపాడు. అక్కడ ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ ఇద్దరూ కలిసి బ్రిలియంట్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ముంబై వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో బంతి వైడ్ కాగా, ఆ తర్వాత బంతికి సింగిల్ వచ్చింది. నాలుగో బంతిని నమన్ ధీర్ ఫోర్‌ కొట్టాడు. ఇక రెండు బంతుల్లో 13 పరుగులు కావాల్సి ఉండగా.. ఐదో బంతిని నమన్ ధీర్ ఫైన్ లెగ్ మీదుగా గాల్లోకి లేపాడు యశ్ దయాల్ ఎలాంటి మిస్టేక్ చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆఖరి బంతి డాట్ అయింది. 19 పరుగులు కావాల్సిన ఆఖరి ఓవర్‌లో కృనాల్ మూడు వికెట్లు తీసుకుని కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఆర్సీబీని గెలిపించాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన కృనాల్ పాండ్యా 54 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ముంబై ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్ రిజల్ట్ నిరాశ కలిగించినా ఐపీఎల్ ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఫుల్ మీల్స్ అందించింది.