Krunal Pandya: కృనాల్‌కు షాక్ ఇచ్చిన లక్నో.. కొత్త వైస్ కెప్టెన్‌గా విండీస్ క్రికెటర్
ఇక గత రెండు సీజన్లలో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కృనాల్ పాండ్యా సూపర్ కెప్టెన్సీతో జట్టును ప్లేఆఫ్స్ చేర్చాడు. అయితే ప్రస్తుతం నికోలస్ పూరన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో లక్నో ఫ్రాంచైజీ అతనికి ప్రమోషన్ ఇచ్చింది.
Krunal Pandya: ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ టీమ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను తప్పించింది. అతని స్థానంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసిన పోస్ట్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్.. నికోలస్ పూరన్‌కు వైస్ కెప్టెన్సీ జెర్సీని అందించిన ఫొటోను పంచుకుంది.
MEGASTAR CHIRANJEEVI: విశ్వంభరలో.. మెగాస్టార్ ఒక్కడే కాదు..
ఇక గత రెండు సీజన్లలో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కృనాల్ పాండ్యా సూపర్ కెప్టెన్సీతో జట్టును ప్లేఆఫ్స్ చేర్చాడు. అయితే ప్రస్తుతం నికోలస్ పూరన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో లక్నో ఫ్రాంచైజీ అతనికి ప్రమోషన్ ఇచ్చింది. యూఏఈ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ తరఫున బరిలోకి దిగిన నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతేకాకుండా ఈ సీజన్‌కు ముందు లక్నో ఫ్రాంచైజీ తమ జట్టును ప్రక్షాళన చేసింది. ఇప్పటికే హెడ్ కోచ్ పదవి జస్టిన్ లాంగర్‌కు కట్టబెట్టిన లక్నో.. టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్‌పై కూడా వేటు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు.
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మాత్రమే ఆడిన రాహుల్.. మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది.