K Srikar Bharat: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముంగిట భరత్ సెంచరీ
ఇంగ్లాండ్ లయన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ జట్టు 227 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు వికెట్ కీపర్.. కేఎస్ భరత్ రాణించాడు.

K Srikar Bharat: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న వేళ.. తెలుగు వికెట్ కీపర్ కేఎస్ భరత్ అదిరే ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచులో సెంచరీతో రాణించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. రెండో ఇన్నింగ్స్‌లో 165 బంతుల్లో 116 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ లయన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ జట్టు 227 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది.
AYODHYA RAM MANDIR: రాముడు ఎందుకు మహనీయుడు..? ఈ దేశానికి ఎందుకంత ప్రేమ..?
అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు వికెట్ కీపర్.. కేఎస్ భరత్ రాణించాడు. జట్టుకు ఓటమి తప్పాలంటే తప్పక రాణించాల్సిన మ్యాచులో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భరత్ శతకం సాధించాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో కేఎస్ భరత్‌కు చోటు దక్కింది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌తో పాటు భరత్.. జట్టులో చోటు దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ స్థానం కోసం కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్‌ల మధ్య పోటీ ఉంది.
ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో వికెట్ కీపర్‌గా భరత్‌కు ప్లేసు దక్కడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ సెంచరీని భరత్.. రాముడికి అంకితమిచ్చాడు.