Kuldeep Sen: మొదట హీరో.. తర్వాత విలన్.. రాజస్థాన్ కొంపముంచిన కుల్దీప్ సేన్
అసలు గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి గుజరాత్ మ్యాచ్ గెలిచిందంటే రాజస్థాన్ బౌలర్ కుల్దీప్ సేన్ కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ లో మొదట హీరోగా ఉన్న కుల్దీప్ సేన్ తర్వాత విలన్ లా మిగిలాడు.

Kuldeep Sen: ఐపీఎల్ 17వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ సంచలన బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
Devara: సరికొత్త రికార్డు.. ఇదీ ఎన్టీఆర్ దేవర రేంజ్
అసలు గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి గుజరాత్ మ్యాచ్ గెలిచిందంటే రాజస్థాన్ బౌలర్ కుల్దీప్ సేన్ కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ లో మొదట హీరోగా ఉన్న కుల్దీప్ సేన్ తర్వాత విలన్ లా మిగిలాడు. భారీ లక్ష్య చేదనలో గిల్ హాఫ్ సెంచరీ చేసినా కుల్దీప్ సేన్ బౌలింగ్ తో గుజరాత్ కష్టాల్లో పడింది. సాయి సుదర్శన్ , మాథ్యూ వేడ్, అభినవ్ మనోహర్ వికెట్లు పడగొట్టి గుజరాత్ ను దెబ్బ తీసాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ షారూఖ్ ఖాన్ ఫోర్, సిక్సర్‌తో ఆశలు రేకెత్తించగా.. గుజరాత్ టైటాన్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి.
కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్‌లో రషీద్ ఖాన్ ఒకటి, తెవాటియా రెండు బౌండరీలు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దాంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమవ్వగా.. తెవాటియా రనౌటవగా.. చివరి బంతికి రషీద్ ఖాన్ బౌండరీ బాది గుజరాత్ ను గెలిపించాడు. కుల్దీప్ సేన్ 19వ ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వడం రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.