Lucknow, KL Rahul : లక్నో బిగ్ షాక్… కెప్టెన్సీ కి రాహుల్ గుడ్ బై ?
ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ లక్నో సూపర్ జైయింట్స్ కు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది.కేఎల్ రాహుల్ లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. ఈ సీజన్‌లో లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ లక్నో సూపర్ జైయింట్స్ కు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది.కేఎల్ రాహుల్ లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. ఈ సీజన్‌లో లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తర్వాత జరిగిన పరిణామాల్లో రాహుల్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా రాహుల్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే రాహుల్‌పై మాటల దాడికి దిగాడు.
గొయెంకా నుంచి ఈ తరహా ప్రవర్తనను ఊహించని రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురై కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. గొయెంకా తదుపరి సీజన్‌లో రాహుల్‌ను వదించుకోవాలని సన్నిహితుల వద్ద ప్రస్తావించాడని సమాచారం. గొయెంకాకు ఆ అవకాశం ఇవ్వడమెందుకని రాహులే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరగుతుంది. 2022 సీజన్‌లో లక్నో టీమ్ లాంచ్ అయినప్పుడు రాహుల్‌ను గొయెంకా 17 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో లక్నో ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల సమయం ఉండటంతో రాహుల్ నిర్ణయం ఏ క్షణానైనా వెలువడవచ్చని సమాచారం. గొయెంకా గతంలో పూణే వారియర్స్ అధినేతగా ఉన్నప్పుడు ధోని విషయంలోనూ ఇలాగే వ్యవహరించాడు. ఓ సీజన్ తర్వాత ధోనిని తప్పించి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించాడు.