RR vs LSG: టార్గెట్ 155.. మొదటి వికెట్ పార్ట్‌నర్‪షిప్ 87.. అయినా చెత్త బ్యాటింగ్‌తో రాజస్థాన్ ఓటమి

155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్ చతికిలపడింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యచులో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నిజానికి రాజస్థాన్ గెలవడం ఖాయమే అనుకున్నారంతా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2023 | 01:20 PMLast Updated on: Apr 20, 2023 | 1:20 PM

Lucknow Super Giants Beat Rajasthan Royals By 10 Runs

RR vs LSG: ఐపీఎల్-2023లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్ చతికిలపడింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యచులో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నిజానికి రాజస్థాన్ గెలవడం ఖాయమే అనుకున్నారంతా. కానీ, నత్తనడక బ్యాటింగ్‌తో రాజస్థాన్ ఓటమి పాలైంది.

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 42 బంతుల్లో 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన బోల్ట్ 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. ఇక 155 పరుగుల ఛేజింగ్‌‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే మొదటి వికెట్‍కు ఏకంగా 87 పరుగుల భాగస్వామ్యాన్ని జతచేసి, అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు. కానీ, ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్ చేరడమే కాకుండా, బద్దకంగా బ్యాటింగ్ చేసి స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయారు.

సునాయాసంగా గెలవాల్సిన ఆటలో పది పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ వంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుకు 155 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. అందులో లక్నో బౌలింగ్ విభాగం పెద్దగా చెప్పుకోదగ్గది కూడా కాదు. కానీ, అందరి అచనాలను తిరగరాస్తూ.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు సరికొత్త విజయాన్ని ఈసారి ఐపీఎల్ అభిమానులకు పరిచయం చేసింది. లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించడమే కాకుండా, అద్భుతమైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసారు. దీంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. లక్నో తదుపరి మ్యాచ్ గుజరాత్‌తో జరగనుంది. సంజూ ఆధ్వర్యంలోని రాజస్థాన్ జట్టు బెంగళూరుతో తర్వాతి మ్యాచులో అమీతుమీ తేల్చుకోనుంది.