Lucknow team deal : ఐపీఎల్‌లోకి విండీస్ సంచలన పేసర్.. జోసెఫ్‌తో లక్నో టీమ్ డీల్
వెస్టిండీస్ (West Indies) యువ సంచలనం షమర్ జోసెఫ్ జాక్‌పాట్ (Shamar Joseph Jackpot) కొట్టాడు. ఈ పేస్ సెన్సేషన్ వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ (Cricket League) ఐపీఎల్ (IPL) లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆస్ట్రేలియా (Australia) గడ్డపై ఇటీవల ముగిసిన రెండో టెస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో వెలుగులోకి వచ్చిన షమర్ జోసెఫ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది.

Lucknow team deal with Joseph, sensational pacer of Windies in IPL
వెస్టిండీస్ (West Indies) యువ సంచలనం షమర్ జోసెఫ్ జాక్‌పాట్ (Shamar Joseph Jackpot) కొట్టాడు. ఈ పేస్ సెన్సేషన్ వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ (Cricket League) ఐపీఎల్ (IPL) లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆస్ట్రేలియా (Australia) గడ్డపై ఇటీవల ముగిసిన రెండో టెస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో వెలుగులోకి వచ్చిన షమర్ జోసెఫ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది. 3 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా జోసెఫ్‌ను తీసుకుంటున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని మార్క్‌వుడ్ నిర్ణయించుకోవడంతో లక్నో రీప్లేస్‌మెంట్‌లో భాగంగా విండీస్ పేసర్‌ను ఎంపిక చేసుకుంది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో షమర్ జోసెఫ్ అదరగొట్టేశాడు. 7 వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శనతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ వేసిన యార్కర్‌కు అతని బొటన వేలు విరిగినా.. పట్టుదలగా బౌలింగ్ చేసి విండీస్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
షమర్ జోసెఫ్ సంచలన ప్రదర్శనతో 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. ఈ ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచం అతనిపై ప్రశంసల జల్లు కురిపించింది.
గయానా దీవుల్లోని ఓ మారుమూల పల్లెటూరికి చెందిన జోసెఫ్ పేద కుటుంబంలో పుట్టాడు. కూలీపనితో పాటు సెక్యూరిటీ గార్డుగానూ పనిచేసాడు. క్రికెట్ మీద ఆసక్తితో పేస్ బౌలింగ్‌లో రాటుదేలాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో నెట్‌బౌలర్‌గా అవకాశం అందుకున్న జోసెఫ్‌ను దిగ్గజ బౌలర్ ఆంబ్రో ప్రోత్సహించాడు. తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు సీపీఎల్‌లో సత్తా చాటి వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి సిరీస్‌లోనే సంచలన ప్రదర్శన కనబర్చి స్టార్‌గా మారాడు. ఐపీఎల్ ద్వారా లభించే డబ్బుతో అతని జీవితం పూర్తిగా మారిపోనుంది.