Lucknow: వంతుల వారీగా దంచుతారు ఇద్దరూ ఇద్దరే

ఐ పి ఎల్ క్యాచ్ రిచ్ లీగ్ లో అసలు సిసలు టీ 20 మజాను పంచుతున్న జట్లలో లక్నో ఫస్ట్ రోలో ఉంటుంది. కె ఎల్ రాహుల్ నాయకత్వంలో ఇరగదీస్తున్న సూపర్ జెయింట్స్, సమిష్టి కృషితో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. లక్నోకి సంబంధించి, దీపక్ హుడా మినహాయిస్తే, ప్రతి ఒక్క ఆటగాడు, తమ తమ విజయాల్లో కీ రోల్ పోషించిన వాళ్లే. ఓపెనర్ కైల్ మేయర్స్ అయితే, ఇప్పుడు ప్రతి జట్టుకు డ్రీం ఓపెనర్ గా మారిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2023 | 06:45 PMLast Updated on: Apr 15, 2023 | 6:45 PM

Lucknow Team Playing Stratagey

నికోలస్ పూరన్, మార్కస్ స్టోఇనిస్, ఆయుష్ బధోని వంటి ప్లేయర్లు లక్నోకు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఎదురులేకుండా చేస్తున్నారు. ఇక బౌలింగ్ లో కుడి లక్నో జట్టు మంచి ఫామ్ లో ఉంది. ప్రధాన బౌలర్ మార్క్ వుడ్ సెన్సేషన్ స్పెల్స్ ఆల్రెడీ చూసే ఉన్నాం. రవి బిష్ణోయ్, సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా, కరుణాళ్ పాండ్యాలు కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ, పార్ట్నర్ షిప్స్ బిల్డ్ కాకుండా చేస్తున్నారు. లక్నో విషయంలో బ్యాటింగ్ తో బౌలింగ్ ను పోల్చుకుంటే అస్సలు మ్యాచ్ కాని ఈక్వేషన్ అది. బ్యాటింగ్ కి 90 మార్కులు ఇస్తే, బౌలింగ్ కు 60 కూడా ఇవ్వలేని పరిస్థితి, కాని, లక్నో వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ విజయాలు సాధించడంలో సక్సెస్ అవుతూ వస్తుంది. రేపు సొంత గ్రౌండ్ లో మరోసారి తన జూలు విదిల్చాలని సూపర్ జెయింట్స్ ఆరాటపడుతోంది. ఈరోజు రాత్రి మొదలయ్యే మ్యాచులో లక్నో నుంచి దాదాపుగా ఒక సెంచురీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.