Dhoni : యువీ ఆల్ టైమ్ ఎలెవన్ ఇదే
భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో యువరాజ్ సింగ్ కు సత్సంబంధాలు లేవని క్రికెట్ వర్గాల్లో చాలా మందికి తెలుసు.
భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో యువరాజ్ సింగ్ కు సత్సంబంధాలు లేవని క్రికెట్ వర్గాల్లో చాలా మందికి తెలుసు. ధోనీ కెప్టెన్సీలో ఆడుతున్నప్పుడు , జట్టు ఎంపిక సమయంలోనూ వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. యువరాజ్ తాను ప్రకటించిన వరల్డ్ క్రికెట్ ఆల్ టైమ్ ఎలెవన్ లో ధోనీని పక్కనపెట్టాడు. మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్ గా ఘనత సాధించిన ధోనీకి యువీ తన ఆల్ టైమ్ ఎలెవన్ లో చోటివ్వలేదు. సచిన్ టెండూల్కర్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేసిన యువీ ఒక్క భారత బౌలర్‌కు అవకాశం ఇవ్వలేదు. 1983 వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ పేరును కూడా విస్మరించాడు.
ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లను ఫినిషర్లుగా ఎంపిక చేసిన యూవీ.. దివంగత స్పిన్నర్ షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లను స్పిన్నర్లుగా ఎంచుకున్నాడు. మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లకు పేసర్లుగా చోటిచ్చాడు. ధోనీతో ఉన్న విభేదాల నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ అతన్ని ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకే టీమ్ లో ఆడినంత మాత్రాన అందరూ ఫ్రెండ్స్ అవ్వాలని లేదంటూ యువీ గతంలో చెప్పిన విషయాన్ని షేర్ చేస్తున్నారు.