Matthew Hayden: పాక్ పేస్ త్రయమే అసలు ముప్పు: మాథ్యూ హేడెన్
గ్రూప్-ఏలో భాగమైన నేపాల్‌పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్.. తదుపరి మ్యాచ్‌లో దాయాదిని ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో భాగంగా మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు.
Matthew Hayden: శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో శనివారం టీమిండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగమైన నేపాల్‌పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్.. తదుపరి మ్యాచ్‌లో దాయాదిని ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో భాగంగా మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘భూగ్రహం మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్ అనడంలో సందేహం లేదు. అయితే, పాకిస్తాన్ పేస్ త్రయం విషయంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలి. షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా.. రూపంలో భిన్న రకాల, వైవిధ్యం కలిగిన బౌలర్లున్నారని హేడెన్ గుర్తు చేసాడు. క్యాండీలో బౌన్సీ వికెట్‌కు ఆస్కారం ఉంది. కాబట్టి పేసర్ల విషయంలో ముఖ్యంగా రవూఫ్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒక్కసారి పట్టు దొరికితే భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగల సత్తా అతడికి ఉందని ఆసీస్ దిగ్గజం జాగ్రత్తలు చెప్పాడు.
ఇక షాహిన్ ఆఫ్రిది.. గత వరల్డ్‌కప్ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే..! షాహిన్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అద్భుత బంతితో అవుట్ చేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు. అని అన్నాడు. అయితే, పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని.. తద్వారా జట్టుకు విజయం అందించగలరని మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు.