రివ్యూ తీసుకోని మ్యాక్స్ వెల్, డకౌట్ తో చెత్త రికార్డ్
పంజాబ్ కింగ్స్ క్రికెటర్, ఆస్ట్రేలియన్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్‌గా నిలిచాడు.

పంజాబ్ కింగ్స్ క్రికెటర్, ఆస్ట్రేలియన్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్‌గా నిలిచాడు.గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. సాయి కిషోర్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్‌లో 19 సార్లు డకౌట్ అయిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ రికార్డును గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు. రోహిత్‌తో పాటు దినేష్ కార్తీక్ కూడా 18 డకౌట్స్‌తో సమంగా ఉన్నాడు. వీరిద్దరి చెత్త రికార్డును మ్యాక్స్‌వెల్ దాటేశాడు. డకౌట్ లిస్ట్‌లో పీయూష్ చావ్లా 16 డక్స్‌తో నాలుగో స్థానం, సునీల్ నరైన్ 16 డకౌట్స్‌తో ఐదో స్థానాల్లో కొనసాగుతోన్నారు. రోహిత్ శర్మ 253 ఇన్సింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ కాగా… మ్యాక్స్‌వెల్ 130 ఇన్సింగ్స్‌లలో 19 సార్లు జీరో స్కోరుకు ఔటయ్యాడు.
మొత్తంగా టీ20 కెరీర్‌లో 460 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 35 సార్లు డకౌట్ అయ్యాడు. టీ20 ఫార్మెట్‌లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే ఔట్ అయినా నాలుగో క్రికెటర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. 2021 నుంచి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు మ్యాక్స్‌వెల్. కానీ గత ఏడాది 10 మ్యాచుల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని పక్కనపెట్టింది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో తొలి రోజు మ్యాక్స్‌వెల్ అమ్ముడుపోలేదు. కానీ రెండో రోజు అతడిని పంజాబ్ కింగ్స్ 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ తొలి మ్యాచ్‌లోనే అతను విఫలమయ్యాడు.
అయితే మాక్స్ వెల్ డకౌట్ వెనుక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. సాయికిశోర్ వేసిన బంతిని మ్యాక్సీ రివర్స్ స్వీప్ బాదే ప్రయత్నంలో అతని నడుముకు తాకడంతో గుజరాత్ ప్లేయర్స్ అప్పీలు చేశారు. ఫీల్డ్ అంపైర్ కూడా ఔట్‌గా ప్రకటించాడు. అయితే నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న శ్రేయస్‌తో మాక్స్ వెల్ ఈ విషయం గురించి ఏం చర్చించకుండానే వెళ్లిపోయాడు. కానీ రిప్లేలో మాత్రం బంతి వికెట్లను తాకలేదని తేలింది. మ్యాక్సీ.. డీఆర్‌ఎస్ తీసుకొని ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది. ఇదే విషయంపై మ్యాచ్ సమయంలో డగౌట్‌లో ఉన్న కోచ్ రికీ పాంటింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అభిమానులు కూడా మ్యాక్సీని తిడుతున్నారు. కనీసం డీఆర్‌ఎస్ తీసుకొని ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది కదా అని చెబుతున్నారు. అనవసరంగా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 2771 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 38 వికెట్లు తీసుకున్నాడు.