Asia Cup: ముగ్గురు మగువలతో ఆసియా కప్ హంగామా
ఆసియా కప్‌కు సంబంధించిన ప్రెజెంటర్ ప్యానెల్‌ను స్టార్ స్పోర్ట్స్ తాజాగా విడుదల చేసింది.

Mayanthi Langer, Zayti Khera and Zainab Abbas to act as female presenters for Asia Cup 2023
2023 ఆసియా కప్‌కు సంబంధించిన ప్రెజెంటర్ ప్యానెల్‌ను స్టార్ స్పోర్ట్స్ తాజాగా విడుదల చేసింది. మొత్తంగా ఐదుగురితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. ప్రెజెంటర్ ప్యానెల్‌లో ఇద్దరు మేల్ యాంకర్లు కాగా, మిగిలిన ముగ్గురు ఫిమేల్ యాంకర్లు. జతిన్ సప్రూ మరియు తనయ్ తివారీ మేల్ ప్రెజెంటర్లు కాగా.. మయాంతి లాంగర్, జైతీ ఖేరా మరియు జైనాబ్ అబ్బాస్ ఫిమేల్ ప్రెజెంటర్లు. మయాంతి లాంగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి ఈవిడ. అంతేకాదు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కోడలు కూడా. స్టార్ స్పోర్ట్స్‌లో చాలా కాలంగా మయాంతి పని చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసే అన్ని క్రికెట్ సిరీస్‌లకు మయంతి వ్యాఖ్యాతగా ఉంటారు.
ఆమె స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్ ఛానెల్‌లలో కనిపిస్తుంటారు. అందం, అభిమానం, మాటలతో మయాంతి మాయ చేస్తారు. ఓటీటీలో ఆకట్టుకున్న కోటా ఫ్యాక్టరీ సీజన్ 2, ఢిల్లీ క్రైమ్ సీజన్ 1లో జైతీ ఖేరా నటించారు. ఆపై ఐపీఎల్‌లో టీవీ వ్యాఖ్యాతగా కనిపించారు. ఇప్పుడు ఆసియా కప్ 2023లో ప్రెజెంటర్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నాసిర్ అబ్బాస్ కూతురు జైనాబ్ అబ్బాస్. ఈసారి ఆసియా కప్‌లో టీవీ యాంకర్‌గా ఈమె సందడి చేయనున్నారు. 2015లో పాక్ స్థానిక ఛానెల్‌లో కెరీర్ ప్రారంభించిన జైనాబ్.. అంచలంచెలుగా ఎదిగారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి టీవీ ప్రెజెంటర్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆమె టీ20 లీగ్‌లలో వ్యాఖ్యాతగా ఉన్నారు. ఈ ముగ్గురు భామల ప్రెసెంటేషన్, ఆసియా కప్ కు మరింత హైప్ తీసుకురానుంది.