Kylian Mbappe: 9వేల కోట్ల ఆఫర్ వదులుకున్నాడు
ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మన్ తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.
కాంట్రాక్ట్ పొడిగించుకోవడానికి ఎంబాపె ఇష్టపడకపోవడంతో అతన్ని వదులుకోవాలని పీఎస్‌జీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంబాపెతో బంధాన్ని కొనసాగించేందుకు పీఎస్‌జీ క్లబ్ అతనికి పదేళ్ల కాలానికి గానూ దాదాపు 1 బిలియన్ యూరోలు అంటే, ఇండియన్ కరెన్సీలో సుమారుగా 9వేల కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ ఎంబాపె అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ఇష్టపడలేదని సమాచారం.
ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్‌లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది.