MS Dhoni: ఆ రెండు సీట్ల వేలం.. బీసీసీఐ అంటేనే బిజినెస్..!
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకను ఓడించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. 49వ ఓవర్‌లో ధోనీ బాదిన సిక్స్‌తో భారత్ ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

MS Dhoni: 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సంయుక్తంగా ప్రపంచకప్ టోర్నీని నిర్వహించారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకను ఓడించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. 49వ ఓవర్‌లో ధోనీ బాదిన సిక్స్‌తో భారత్ ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఇక, సుమారు 12 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మరోసారి ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ జరుగుతోంది.
అక్టోబర్ 5 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుండగా, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అజేయంగా 93 పరుగులు చేశాడు. చివర్లో నువాన్ కులశేకర్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిచాడు. భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఈ సిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాగా ధోని కొట్టిన సిక్స్ బంతి పడిన రెండు సీట్లను వేలం వేయనుంది ముంబై క్రికెట్ అసోసియేషన్. ‘ఈ చారిత్రాత్మక క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఆ బంతి పడిన వాంఖడే స్టేడియంలోని రెండు సీట్లను ఎంసీఏ వేలం వేస్తోంది’ అని ట్వీట్ చేసింది ఎంసీఏ.