Mitchell Starc: మిచెల్ స్టార్క్ కోసం ఆ రెండు జట్ల పోటీ..!
అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఐపీఎల్ మంచి సన్నాహక మ్యాచులుగా మారుతాయని స్టార్క్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే 8 ఏళ్ల తర్వాత ఈ లీగ్‌లో ఆడాలని, 'విల్లో టాక్' పోడ్‌కాస్ట్‌తో చెప్పుకొచ్చాడు.

Mitchell Starc: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎనిమిదేళ్ల తర్వాత భారత రిచ్ లీగ్ T20 టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌కు తిరిగి రావాలని చూస్తున్నట్లు సమాచారం. ఎడమచేతి వాటం బౌలర్ చివరిసారిగా 2015 పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. కానీ, ఇటీవలి సంవత్సరాలలో తన ఆట భారాన్ని తగ్గించుకోవడానికి, జాతీయ జట్టు విధులపై దృష్టి పెట్టడానికి IPL నుంచి తప్పుకున్నాడు.
అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఐపీఎల్ మంచి సన్నాహక మ్యాచులుగా మారుతాయని స్టార్క్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే 8 ఏళ్ల తర్వాత ఈ లీగ్‌లో ఆడాలని, ‘విల్లో టాక్’ పోడ్‌కాస్ట్‌తో చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ 2024లో ఆడడంతో టీ20 ప్రపంచకప్‌నకు చక్కగా ప్రిపేర్ అవ్వొచ్చని, ఇది సరైన అవకాశంగా భావిస్తున్నానని ఈ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌తో 50 ఓవర్ల ప్రపంచ కప్ కోసం సన్నాహకంలో ఉండగా, స్టార్క్ ప్రస్తుతం గాయంతో ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.
అయితే, వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియా తాత్కాలికంగా ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో ఈ ఎడమచేతి వాటం పేసర్‌కు చోటు దక్కడం విశేషం. అయితే స్టార్క్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడనున్నట్టు క్రికెట్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.