Mitchell Starc: ఐపీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్.. ఒక్క బాల్ వేస్తే రూ.7 లక్షలు
ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్.. IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అదిరే రికార్డు సృష్టించాడు. మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలంలో భారీ రికార్డులు నమోదవుతున్నాయి. వేలం మొదటి అర్ధభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయి ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే కేవలం ఒక గంట తర్వాత ఈ రికార్డు కూడా బద్దలైంది. అదే ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్.. IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అదిరే రికార్డు సృష్టించాడు. మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Sunrisers Hyderabad: కావ్య పాపా ఖలేజా అదుర్స్.. కీలక ఆటగాళ్లను దక్కించుకున్న ఎస్‌ఆర్‌హెచ్
అసలైతే మిచెల్ స్టార్క్ బేస్ ధర రూ.2 కోట్లు మాత్రమే. అక్కడినుంచి మొదలైన బిడ్డింగ్.. గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీగా సాగింది. మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కూడా మిచెల్ స్టార్క్ కోసం వేలం వేశాయి. కానీ, అత్యధిక బిడ్ వైపు వెళ్లేసరికి, ఆ జట్లు దూరంగా నిలిచాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో కేవలం రెండు సీజన్లు మాత్రమే ఆడాడు. అతను చివరిసారిగా 2015లో ఐపీఎల్ ఆడాడు. ఆ తరువాత మిచెల్ స్టార్క్ ఎప్పుడూ IPL ఆడలేదు. రీసెంట్‌గా జరిగిన వరల్డ్ కప్‌లో తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటిన ఈ స్టార్ బౌలర్, ఐపీఎల్ చరిత్రలో ఈ విధంగా సరికొత్త రికార్డు సృష్టించాడు. మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడగా, అందులో 34 వికెట్లు పడగొట్టాడు.
ఇప్పుడు కలకత్తా నైట్ రైడర్స్ తరపున నిప్పులు చెరిగే బంతులతో మిచెల్ బరిలో దిగనున్నాడు. జనరల్‌గా ఒక్కో ఫ్రాంచైజీ.. దాదాపుగా 14 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ఆ విధంగా మిచెల్ స్టార్క్ అన్ని మ్యాచుల్లో ఆడినా కూడా.. మ్యాచుకు 1.76 లక్షలు సంపాదించినట్టు లెక్క. ఒక మ్యాచులో గరిష్టంగా 4 ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్క్ ధరను గమనిస్తే ఒక్కో ఓవర్‌కు రూ.44.19 లక్షలు పలికినట్టే. అంటే, ఒక్కో బంతికి రూ.7.36 లక్షలు మిచెల్ స్టార్క్ సంపాదించబోతున్నాడన్నమాట. క్రికెట్ చరిత్రలోనే ఇది మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాదేది క్రికెట్‌లో అనర్హం అని.. మిచెల్ తన బిడ్డింగ్ ద్వారా మరోసారి రుజువుచేసినట్టయింది.