Mohammad Hafeez: మీ మీద అనుమానమే.. భారత జట్టుపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు. "టీమిండియా చాలా మంచి జట్టు. అయితే బెస్ట్ మాత్రం కాదు" అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా ప్లేయర్స్ ఆటను చూస్తే కనీసం నాకౌట్ వరకైనా వెళ్తారా అనే అనుమానం కలుగుతుందని హఫీజ్ అన్నాడు.

Mohammad Hafeez: ఈ ఏడాది నిర్వహించబోయే వరల్డ్ కప్ 2023 టోర్నీ భారత్ వేదికగా జరుగనుంది. అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ అయ్యే ఈ వన్డే ప్రపంచక్ కప్‌లో 10 టీమ్స్ పోటీపడబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో భారత జట్టు హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. ఇక, తాజాగా పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు.
“టీమిండియా చాలా మంచి జట్టు. అయితే బెస్ట్ మాత్రం కాదు” అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా ప్లేయర్స్ ఆటను చూస్తే కనీసం నాకౌట్ వరకైనా వెళ్తారా అనే అనుమానం కలుగుతుందని హఫీజ్ అన్నాడు. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలంటే మాత్రం మ్యాచ్ విన్నర్లు కావాలి.. ద్వైపాక్షిక సిరీసుల్లో వాళ్లు బాగా ఆడుతున్నారు. ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చే సరికి ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారని హఫీజ్ పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు లేరు.. టాపార్డర్‌లో రోహిత్, విరాట్ తప్ప మిగిలిన ప్లేయర్లకు అనుభవం లేదు అంటూ మహ్మద్ హఫీజ్ అన్నారు.
ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తేలిపోవడానికి ఇదే ప్రధాన కారణమన్నాడు. ఐసీసీ టైటిల్ గెలిచి పదేళ్లు గడుస్తున్నా.. వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన టీమ్‌ని వాళ్లు ఇప్పటి వరకు తయారుచేయలేకపోతున్నారని, మెగా ఈవెంట్లలో బాగా ఆడాలంటే ప్లేయర్ల మెంటల్ స్ట్రెంత్ చాలా ముఖ్యమని ఈ పాక్ ఆల్ రౌండర్ అన్నాడు.