Mohammad Shami: భారత విజయాలపై పాక్ మాజీల అక్కసు.. షమీ ఇచ్చిన సమాధానం ఇదే..!
పాకిస్తాన్ మాజీ టెస్టు ప్లేయర్ హసన్ రజా.. నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. భారత్, శ్రీలంక మ్యాచులో భారత బౌలర్లు చెలరేగడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రజా.. భారత బౌలర్లకు ఏదో స్పెషల్ బంతి అందజేస్తున్నారని ఆరోపించాడు.

Mohammad Shami: వరల్డ్ కప్‌లో అజేయంగా దూసుకుపోతున్న టీమిండియాను చూసి, దాయాది దేశం పాకిస్తాన్ కుళ్లుకొని చస్తోంది. ఆ టీం మాజీ ప్లేయర్లు అయితే ఏకంగా భారత జట్టు ఈ మెగాటోర్నీలో చీటింగ్ చేస్తోందని అభాండాలు వేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ టెస్టు ప్లేయర్ హసన్ రజా.. నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. భారత్, శ్రీలంక మ్యాచులో భారత బౌలర్లు చెలరేగడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రజా.. భారత బౌలర్లకు ఏదో స్పెషల్ బంతి అందజేస్తున్నారని ఆరోపించాడు.
Mohammad Shami: పెళ్లికి రెడీ.. షమీతో పాయల్ పెళ్లి..! మాజీ భార్య రియాక్ట్..
ఈ టోర్నీ భారత్‌లో జరుగుతోంది కాబట్టి.. బీసీసీఐ ప్రత్యేకంగా తయారు చేసిన బంతిని భారత బౌలర్లకు ఇస్తోందని అన్నాడు. అప్పుడే అతనిపై ఫ్యాన్స్ మండిపడ్డారు. పాక్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా రజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చల్లారిందని అనుకునేలోపే సౌతాఫ్రికాతో టీమిండియా తలబడింది. ఈ మ్యాచులో కూడా భారత బౌలర్లు అదరగొట్టారు. అయితే ఈసారి డీఆర్ఎస్‌ను కూడా బీసీసీఐ హైజాక్ చేసిందని, తమకు అనుకూలంగా డెసిషన్స్ ఇచ్చుకుంటోందని హసన్ రజా ఆరోపించాడు. ఇవన్నీ చూసిన టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకి చిర్రెత్తుకొచ్చింది.
హసన్ రజాకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన షమీ.. ‘ఇలా మాట్లాడుతున్నందుకు కొంచెమైనా సిగ్గు పడాలి. ఇలా చెత్త వాగుడు వాగడం కన్నా ఆటపై ఫోకస్ పెడితే బాగుంటుంది. అప్పుడప్పుడైనా ప్రత్యర్థి సక్సెస్‌ను కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకో’ అన్నాడు.