Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ..! ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ..?
కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని మహమ్మద్ షమీని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం.
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహమ్మద్ షమీ సిద్దమవుతున్నట్లు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అతను కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
KALKI 2898 AD: కల్కిలో ప్రభాస్ పాత్ర పేరెంటో తెలుసా..? కొత్త పోస్టర్ రిలీజ్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని మహమ్మద్ షమీని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం. ముస్లింల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ షమీని అస్త్రంగా వాడుకోవాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెంగాల్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఒకటైన బసీర్హట్ నుంచి షమీని పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై మహమ్మద్ షమీ కానీ.. బీజేపీ పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ ఇటీవలే సర్జరీ చేయించుకొని ఐపీఎల్ 2024 సీజన్‌కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావాలని అతని సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.